అతిగా నిద్రపోతున్నారా.? అయితే ఏ క్షణంలోయినా చనిపోవచ్చు అంట.?     2018-06-12   06:49:01  IST  Lakshmi P

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సమంత చెప్పినట్టు నాకు ఇష్టమైనవి రెండే రెండు ఒకటి నిద్ర రెండు మంచి మొగుడు. తనకే కాదు చాలా మందికి నిద్ర అంటే చాలా ఇష్టం. నిద్రపోవటం కంటే సుఖం ఇంకెందులో ఉండదు అనుకుంటారు. అయితే ప్రియులకు ఇది తాజా హెచ్చరిక.

అతి నిద్ర ఏమాత్రం మంచిది కాదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా ఎనిమిది గంటలు మించి నిద్రపోతూ ఉంటే వారు ఏక్షణమైనా సమస్యల వలయంలో చిక్కుకోవచ్చని సెలవిస్తున్నారు. వీరికి గుండెపోటు వచ్చేందుకు 146శాతం అధికంగా అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఏడు నుంచి ఎనిమిది గంటలు మాత్రమే నిద్రపోయి తప్పనిసరిగా వ్యాయామం చేసేవారు మాత్రం జీవితాంతం ఎలాంటి ఆరోగ్య పరమైన సమస్యలను ఎదుర్కోకుండా హాయిగా బతికేయొచ్చని కూడా వారు సెలవిస్తున్నారు.