అది “చంద్రబాబు” గొంతే..ఫోరెన్సిక్ నిర్ధారణ త్వరలో..     2018-05-06   23:33:15  IST  Bhanu C

ఓటుకు నోటు కేసు తెలుగు రాష్ట్రాలలో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు..ఈ కేసుకు సంభందించి ఫోన్ సంభాషణలో ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ మాట్లాడిన గొంతు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిదేనని ఫోరెన్సిక్ నివేదిక తేల్చినట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది..అయితే ఈ కేసుకు సంభందించిన ప్రతీ విషయం ఇప్పుడు అమిత్ షా కనుసన్నలలో ఉంది అనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి..చంద్రబాబు అరెస్టు తప్పదని..ఓటుకు నోటు కేసులో బాబు అడ్డంగా బుక్కయ్యారనే వార్తలు సైతం సోషల్ మీడియాలో రావడంతో మరో మారు ఈ కేసు ఆసక్తి కరంగా మారింది..

“మనవాళ్ళు బ్రీఫిడ్ మీ” అన్న మాటలు చంద్రబాబు వేనని తేలడంతో ఇప్పుడు చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది అంటూ రకరకాల ఊహాగానాలు హల్చల్ చేస్తున్నాయి..అయితే ఒక వేళ అరెస్టు గనుకా అనివార్యం అయితే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు పై తీవ్రమైన ప్రభావం ఉంటుంది..పార్టీ ఉనికే ప్రశ్నార్ధకం అవుతుంది ఎందుకంటే చంద్రబాబు స్థాయిలో పార్టీని నిలబెట్టగలిగే వ్యవస్థ గానీ వ్యక్తులు గానీ పార్టీలో లేరని అంటున్నారు విశ్లేషకులు.. రేవంత్ రెడ్డి వరకే ఇప్పటి వరకు ఈ కేసు పరిమితమైంది…ఇక మీదట విచారణలో భాగంగానే చంద్రబాబు టార్గెట్ గా ఈ కేసు వెళ్ళబోతోంది అంటున్నారు..