Online Poll – Most kissable heroines of India

మగువ అధరాలలో మాధుర్యాన్ని వెతుక్కునే కవితాత్మక హృదయం మగవాడిది అన్నాడో కవి. మరి మగవారికి ఇంత గొప్ప హృదయం ఊరికే వచ్చిందా లేక దేవుడు అమ్మాయిల పెదాల్ని కాస్త శ్రద్ధ పెట్టి తట్టుకోలేనంత అందంగా చెక్కడం వలన వచ్చిందా అనే విషయాన్ని పక్కనపెడితే, ఎలాగైతే ఏం .. మగువ అధరాల్ని చుంబించాలనే, వేల ఏళ్ళుగా, మహావీరులైనా ఆడవారి బానిసలుగా బ్రతుకుతున్నారు. మరి ఇప్పుడు మన దేశంలో చూడగానే ముద్దాడలనిపించేంత అందమైన పెదాలు ఎవరికి ఉన్నాయి?

ఈ ప్రశ్నని 26,000 మంది భారతీయ మగవారిని అడిగింది ఓ ఆన్ లైన్ లైఫ్ స్టయిల్ పోలింగ్ హ్యాండిల్. కేవలం టాప్ 3 కోసమే నిర్వహించిన ఈ ఓటింగ్ లో దీపికా పడుకోనే, కరీనా కపూర్, శృతిహాసన్, కాజల్ అగర్వాల్‌ లాంటి గొప్ప గొప్ప అందగత్తెలు ఓడిపోయారు. మరి గెలిచినవారికి ఆ గౌరవం దక్కే అర్హత లేదా అంటే అలా కూడా కాదు .. ఆ ముగ్గురు కూడా మహాసౌందర్యానికి ప్రతిరూపాలే.

ఆ ముగ్గురే, ఐశ్వర్యరాయ్, కత్రీనా కైఫ్, దిశా పటాని. 43 ఏళ్ళు వచ్చినా, ఇంకా ఐశ్వర్యరాయ్ పెదాలను ఆరాధించడం మానలేదు భారత యువత. అందుకే ప్రపంచ సుందరికే మొదటిస్థానం కట్టబెట్టారు. ఇంకా కత్రీనా కైఫ్ అనగానే చాలామంది దృష్టి మొదట తన పెదాల మీదికే వెళతాయి.

ఏదో సినిమాలో “నడుమెక్కడ చేయించిందిరా బాబు .. ఇంత సన్నగా ఉంది” అని అన్నట్లు, కత్రీనాని చూడగానే పెదాలు ఎక్కడ డిజైన్ చేయించుకుందో అనే అనుమానం రాకమానదు. అంత అందమైన పెదాలు కాబట్టి, ముద్దు పెట్టాలనిపించే పెదాల్లో ఈ 33 ఏళ్ళ సుందరి పెదాలు రెండొవ స్థానంలో నిలిచాయి.

ఇక ఇప్పటివరకు మూడంటే మూడే సినిమాలు తీసిన దిశా పటాని అప్పుడే యువతరం గుండెల్లో అలజడులు సృష్టిస్తోంది .. స్టార్ హీరోయిన్లు ఎందరినో కాదని, 24 ఏళ్ళ దిశా పెదాలకి మూడోవ స్థానం అప్పగించారు ఇండియా అబ్బాయిలు.