ఉల్లిపాయ తొక్కలను పాడేస్తున్నారా....దానితో ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?     2018-06-04   23:21:19  IST  Lakshmi P

మనం ప్రతి రోజు ఉల్లిపాయలను వాడుతూ ఉంటాం. కూరల్లో ఉల్లిపాయ లేనిదే గడవదు. అలాగే కొంత మంది పచ్చి ఉల్లిపాయను పచ్చడిలో నలుచుకొని తింటూ ఉంటారు. మరి కొంత మంది మజ్జిగలో వేసుకొని త్రాగుతూ ఉంటారు. అయితే మనం ఉల్లిపాయ తొక్కలను పాడేస్తూ ఉంటాం. కానీ వాటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

ఉల్లి తొక్కలను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఆ నీటితో నొప్పులు ఉన్న చోట రాస్తే నొప్పులు తొందరగా తగ్గుతాయి. ఈ నీటిని చర్మానికి రాసుకొని అరగంట అయ్యాక స్నానము చేస్తే చర్మ సమస్యలు తగ్గిపోతాయి.