చర్మంపై జిడ్డును తొలగించే అద్భుతమైన నిమ్మ పాక్స్    2018-06-15   00:17:24  IST  Lakshmi P

నిమ్మరసం అనేక చర్మ సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తున్నారు. నిమ్మరసంను పురాతన కాలం నుండి చర్మ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. చర్మంలో ఉన్న అధికంగా ఉన్న నూనెను తొలగించటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది. నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ చర్మంపై జిడ్డును తొలగించటంలో సహాయపడుతుంది. నిమ్మతో పేస్ పాక్స్ ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.

ఒక గుడ్డు తెల్లసొనలో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి రాసి 20 నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే జిడ్డు సమస్య తొలగిపోతుంది.

రెండు స్పూన్ల టమోటా గుజ్జులో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి రాసి 20 నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే జిడ్డు తొలగిపోతుంది.