Ohio Woman arrested for raping a taxi driver at knifepoint

అమెరికా యువతని పట్టుపీడిస్తున్న పెనుభూతాలు రెండు .. ఒకటి సెక్స్ అడిక్షన్ రెండు డ్రగ్ అడిక్షన్. ఈ అవసరాలు తీర్చుకోవడం కోసమే అక్కడి యువత తప్పుదోవలు పడుతోంది. తాజాగా ఓ పురుష డ్రైవర్ ని రేప్ చేసిన ఓ అమ్మాయిని పోలీసులు అరెస్టు చేసారు. నమ్మడానికి కష్టంగా ఉన్నా మీరు విన్నది నిజమే. ఓ అమ్మాయి ఓ డ్రైవర్ అతని కారులోనే రేప్ చేసింది. అప్పుడు ఆ డ్రైవర్ తప్పించుకోవడానికి ప్రయత్నించలేదా అని అనుమానపడొచ్చు. అక్కడే ట్విస్ట్‌ ఉంది.

వివరాల్లోకి వెళితే జనవరి 28, 2017వ తేదిన బ్రిటన్ని కార్టర్ అనే అమ్మాయి ఉదయాన్నే ఓ హోటల్ నుంచి బయటికోస్తూ ఉదయం 4:28 ప్రాంతంలో ఓ ట్యాక్సిని ఆపింది. ఆమెతో పాటు కొరే జాక్సన్ అనే 20 ఏళ్ళ కుర్రాడు, మరో గుర్తు తెలియని వ్యక్తి కూర్చున్నారు. కారు కదిలిన కాసేపటికే కోరే జాక్సన్ కత్తి తీసి డ్రైవర్ మెడకి గురిపెట్టాడు.