కార్తీక సోమవారం రోజు శివుడికి వీటిని సమర్పిస్తే...అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి Devotional Bhakthi Songs Programs     2017-11-11   21:54:16  IST  Raghu V

Offering Things to Lord Shiva in Karthika Masam

కార్తీక మాసం ప్రత్యేకత ఏమిటంటే ఈ మాసం శివ కేశవులు ఇద్దరికీ ప్రీతికరమైన మాసం. సోమవారం రోజు శివునికి అభిషేకం చేసి శివారాధన చేస్తే కోరుకున్న కోరికలు తీరతాయి. అలాంటిది అత్యంత పవిత్రమైన కార్తీక సోమవారం నాడు శివునికి అభిషేకం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి. సాధారణంగా చాలా మంది శివునికి అభిషేకం పాలు, నీటితో మాత్రమే చేస్తూ ఉంటారు. జీవితంలో కలిగే ఆటంకాలు తొలగిపోవాలంటే చెరకురసం,తేనే వంటి వాటితో అభిషేకం చేయాలి. దేనితో అభిషేకం చేస్తే ఏ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.

పరమ శివునికి తేనెతో అభిషేకం చేస్తే ఆరోగ్యం,దీర్ఘ ఆయువు కలుగుతుంది. శివునికి అత్తరు పూస్తే జీవితంలో సుఖ సంతోషాలకు కొదవు ఉండదు. చెరకు రసంతో శివునికి అభిషేకం చేస్తే ఆర్ధిక సమస్యలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. శివునికి ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే సంతానం లేని వారికీ సంతానం కలుగుతుంది. మామిడి పండ్ల రసముతో అభిషేకము చేస్తే దీర్ఘ వ్యాధులు నశిస్తాయి. మారేడు బిల్వ దళం లతో అభిషేకము చేస్తే భోగభాగ్యములు లభిస్తాయి. ద్రాక్ష రసముతో అభిషేకం చేస్తే చేసే ప్రతి పనిలోనూ విజయం కలుగుతుంది. పసుపు నీటితో అభిషేకించిన శుభ కార్యములు జరుగుతాయి. పాలు, గంగా జలంతో శివలింగాన్ని పూజించిన వారికి ఒత్తిడి దూరం అయ్యి మనసు నిర్మలంగా ఉంటుంది.