బిగ్‌బాస్‌ సీజన్‌ 2 లో వాళ్ళకి అన్యాయం జరుగుతుందా     2018-06-25   00:23:03  IST  Raghu V

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 2 రెండు వారాలు పూర్తి చేసుకుంది. తాజాగా రెండవ వారం ఎలిమినేషన్‌ కార్యక్రమం కూడా పూర్తి అయ్యింది. రెండవ వారంలో ఇంటి నుండి నూతన్‌ నాయుడు ఎలిమినేట్‌ అయ్యాడు. బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో మొదటి వారం సంజన, రెండవ వారం నూతన్‌ నాయుడులు ఎలిమినేట్‌ అవ్వడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వీరిద్దరు కూడా సామాన్యుడి కోటాలో బిగ్‌బాస్‌ ఇంటికి వెళ్లిన విషయం తెల్సిందే. సామాన్యులకు ఛాన్స్‌ ఇచ్చినట్లే ఇచ్చి వెంటనే పంపించడం ఏంటని కొందరు విమర్శలు చేస్తున్నారు. బిగ్‌బాస్‌ సీజన్‌ 2పై వస్తున్న విమర్శలకు ఇది కూడా తోడైంది.

మొదటి సీజన్‌లో కేవలం సెలబ్రెటీలకు మాత్రమే ఛాన్స్‌ ఇచ్చిన నిర్వాహకులు రెండవ సీజన్‌లో మాత్రం భారీ ఎత్తున ఆడిషన్స్‌ నిర్వహించి లక్షల మందిలో ముగ్గురిని ఎంపిక చేయడం జరిగింది. ఆ ముగ్గురిలో సంజన, నూతన్‌ నాయుడు, గణేష్‌ ఉన్నారు. ఈ ముగ్గురికి మొదటి నుండి కూడా బిగ్‌బాస్‌లో ఉన్న సెలబ్రెటీల నుండి వ్యతిరేకత వస్తుంది. సామాన్యులకు మొదటి మూడు లేదా అయిదు వారాల పాటు ఎలిమినేషన్‌ నుండి ఉపశమనం కల్పిస్తే ఖచ్చితంగా వారి సత్తా ఏంటీ అనేది తేలిపోయింది. వారు హౌస్‌కు అవాటు పడుతున్న సమయంలో వారిని ఎలిమినేట్‌ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది.