నాకు దమ్ములేదు..ఆ అర్హత నీకు మాత్రమే ఉంది     2018-05-01   21:44:22  IST  Raghu V

తెలుగు సినిమా పరిశ్రమ దిగ్గజాల్లో ఒక్కరైన నందమూరి తారక రామారావు నట వారసులుగా ఎంతో మంది ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే సీనియర్‌ నట వారసుడు ఎవరు అని చిన్న పిల్లాడిని ప్రశ్నించినా కూడా జూనియర్‌ ఎన్టీఆర్‌ అనే సమాధానం ఠక్కువ వస్తుందనడంలో సందేహం లేదు. బాలకృష్ణ కంటే కూడా అధికంగా ఎన్టీఆర్‌ క్రేజ్‌ ఉంది. అయినా కూడా తాతగారిపై గౌరవంతో ఎన్టీఆర్‌ ఆయన పాత్రలను చేసేంత సత్తా, ధైర్యం నాకు లేదు అంటూ ఉంటాడు. తాజాగా ‘మహానటి’ చిత్రం కోసం ఎన్టీఆర్‌ పాత్రకు గాను ఎన్టీఆర్‌ను సంప్రదించేందుకు నిర్మాత స్వప్న వెళ్లారట. ఆ సమయంలో ఎన్టీఆర్‌ సున్నితంగా తిరష్కరించినట్లుగా తెలుస్తోంది.

‘మహానటి’ ఆడియో వేడుక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్టీఆర్‌ ఆ విషయం గురించి మాట్లాడుతూ.. ‘మహానటి’ వంటి అద్బుతమైన చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరిని నా హ్యాట్సాప్‌. అద్బుతమైన టీంతో ఈ చిత్రం తెరకెక్కింది. నిజంగా ఒక మహా మనిషి గురించి ఈ చిత్రంలో చూపిస్తున్నారు. ఈ చిత్రంలో తాతగారిగా చిన్న పాత్రలో నటించాల్సిందిగా స్వప్న రిక్వెస్ట్‌ చేసింది. కాని తాను అందుకు అర్హుడిని కాదు అంటూ నో చెప్పాడు. ఆయన పాత్ర చేయాలంటే తన అనుభవం సరిపోదని, ఆయనగా నేను మెప్పించలేను అంటూ ఎన్టీఆర్‌ చెప్పుకొచ్చాడు.