రాజమౌళిపై ఆగ్రహంగా ఉన్న ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌!     2018-05-20   21:49:00  IST  Raghu V

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ల కలయికలో ఒక భారీ మల్టీస్టారర్‌ చిత్రం రాబోతున్న విషయం తెల్సిందే. ఈ కలయిక కోసం గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈమద్య కాలంలో ఎన్నో మల్టీస్టారర్‌లు వస్తూనే ఉన్నాయి. కాని ప్రేక్షకులు కోరుకునే అసలు మజా మల్టీస్టారర్‌కు జక్కన్న రంగం సిద్దం చేశాడు. భారీ స్థాయిలో రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌లతో మల్టీస్టారర్‌ను తెరకెక్కించేందుకు పక్కా స్క్రిప్ట్‌ను సిద్దం చేస్తున్నాడు. ఈ సమయంలోనే రాజమౌళిపై ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ కాస్త కినుకు వహిస్తున్నారు.

తాజాగా ఎన్టీఆర్‌ తన పుట్టిన రోజును జరుపుకున్న విషయం తెల్సిందే. స్టార్‌ హీరోల పుట్టిన రోజులకు వారు నటించే, నటించబోతున్న సినిమాలకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌లను విడుదల చేసిర, వారి అభిమానులకు కానుకగా ఇస్తారు. అదే తరహాలో ఎన్టీఆర్‌ నటిస్తున్న రెండు సినిమాలకు సంబంధించిన బర్త్‌డే గిఫ్ట్‌లు వస్తాయని అంతా ఆశించారు. కాని త్రివిక్రమ్‌ మాత్రమే ఎన్టీఆర్‌ బర్త్‌డేనే గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేశాడు. ఎన్టీఆర్‌ బర్త్‌డే విషయాన్ని జక్కన్న కనీసం గుర్తు కూడా చేసుకోలేదు. దాంతో ఆయనపై ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహంగా ఉన్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. తమ ఆగ్రహంను సోషల్‌ మీడియా ద్వారా వారు వెళ్లడి చేస్తున్నారు.’