NTR fans angry with MAA TV

జనతా గ్యారేజ్ గత నెల 1వ తేదిన విడదలైన విషయం తెలిసింది. హిట్ టాక్ ని సొంతం చేసుకోని కలెక్షన్లు భారిగా దండుకున్న ఈ చిత్రం, బాహుబలి, శ్రీమంతుడు సినిమాల తరువాత మూడో అతిపెద్ద తెలుగు హిట్ గా నిలిచింది. అయితే ప్రస్తుత ట్రెండ్ లో ఏ సినిమా అయినా, హిట్ అయితే కలెక్షన్లు వచ్చేది ఓ నాలుగు వారాలే. ఆ తరువాత మెల్లిమెల్లిగా చిల్లర రావడం మొదలవుతుంది. ఈ 50 రోజులు, 100 రోజులు ఆడాలనుకోవడం అభిమానుల అత్యాశే తప్ప, నిర్మాతలకి కాని, పంపిణీదారులకి మాత్రం పెద్దగా ఒరిగేది ఏమి ఉండదు.

జనతా గ్యారేజ్ ఇలా 50 రోజులు పూర్తి చేసుకోగానే, అలా మాటీవిలో రాబోతోంది. ఈ నెల 23వ తేదిన ఈ సినిమాని సాయంత్రం 5:30 గంటలకి టెలికాస్ట్ చేయనుంది మాటీవి. ఈ విషయం ఎన్టీఆర్ అభిమానులకి నచ్చట్లేదు. థియేటర్లో ఇప్పటికీ ఆడిస్తే ఇంకా కలెక్షన్లు వస్తాయని అనుకుంటున్నారో, అప్పుడే టీవిలో రావడం ఏదో అవమానంలా భావిస్తున్నారో కాని, మాటీవిలో పనిచేసే వారిని సోషల్ మీడియాలో బూతులు తిడుతున్నారు. అక్కడితో ఆగకుండా ఇలా మాటివిపై తమకు తోచిన రోతిలో నిరసనలు తెలుపుతున్నారు.

ఇక్కడ అభిమానులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇప్పుడు సినిమాని టెలికాస్ట్ చేయడం వలన సినిమాకి కలిగే నష్టమేమి లేదు. ఛానెల్ కి ఉన్న సమస్యలు ఛానెల్ వి. అంత డబ్బు పెట్టి సినిమా కొన్నప్పుడు వేడిలో ఉండగానే లాభాలు వెనకేసుకోవాలిగా!