ఎన్టీఆర్‌కు సైడ్‌ ఇచ్చిన వైఎస్‌ఆర్‌.. ఊపిరి పీల్చుకున్న బాలయ్య..     2018-09-13   11:55:46  IST  Ramesh P

నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్‌’. తెలుగు ప్రజల ఆరాద్య దైవం నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంతో పాటు ఏపీ మాజీ సీఎం, తెలుగు వారు ఎప్పటికి గుర్తుంచుకునే వ్యక్తి రాజశేఖర్‌ రెడ్డి జీవిత చరిత్ర ‘యాత్ర’ కూడా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్‌ చిత్రం ఇప్పటికే సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా దర్శకుడు క్రిష్‌ మరియు బాలకృష్ణలు ప్రకటించారు. అదే సమయంలో ‘యాత్ర’ను కూడా సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

Balakrishna New Movie,Mammutti New Movie,Ntr Biopic,NTR Biopic Will Release Before YSR Biopic,TRR Biopic Release Date,YSR Biopic

సంక్రాంతి బరిలో ఇప్పటికే రామ్‌ చరణ్‌, బోయపాటిల మూవీ విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. చరణ్‌ మూవీతో పాటు ఎన్టీఆర్‌ మరియు యాత్రలు కూడా రాబోతున్న నేపథ్యంలో పోటీ తీవ్రంగా ఉంటుందని అంతా భావించారు. ముఖ్యంగా ఎన్టీఆర్‌ మరియు యాత్రల మద్య పోటీ ఎక్కువ ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే తాజాగా యాత్ర సినిమా విడుదల తేదీని మార్చారు. సంక్రాంతికి ముందే అంటే డిసెంబర్‌లోనే సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

‘యాత్ర’ సినిమాను డిసెంబర్‌లో జగన్‌ బర్త్‌డే సందర్బంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. వచ్చే నెలలో షూటింగ్‌ను పూర్తి చేయాలని, మమ్ముటి ఈ చిత్రంలో అద్బుతంగా నటించాడు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పాదయాత్ర సీన్స్‌ను తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.

Balakrishna New Movie,Mammutti New Movie,Ntr Biopic,NTR Biopic Will Release Before YSR Biopic,TRR Biopic Release Date,YSR Biopic

యాత్ర చిత్రం డిసెంబర్‌ 21న జగన్‌ బర్త్‌డే సందర్బంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో బాలయ్య ఊపిరి పీల్చుకున్నట్లుగా సమాచారం అందుతుంది. రెండు బయోపిక్‌లపై భారీ అంచనాలున్న నేపథ్యంలో రెండు ఓకే సారి విడుదలైతే ఖచ్చితంగా రెంటిపై ప్రభావం పడుతుంది. అందుకే ఈ నిర్ణయంను ‘యాత్ర’ నిర్మాతలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా రాబోతున్న బాలయ్యకు చరణ్‌తో మాత్రమే ఇప్పుడు పోటీ.