బిగ్‌బాస్‌ ఇంటికి యంగ్‌ టైగర్‌?     2018-06-28   06:24:52  IST  Raghu V

తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ‘బిగ్‌బాస్‌’కు తాజాగా సీజన్‌ 2 ప్రారంభం అయ్యింది. అంతా అనుకున్నట్లుగా బిగ్‌బాస్‌ సీజన్‌ 2 అంతగా ఆకట్టుకోలేక పోతుందనే విషయం వాస్తవం. ఇంట్లో సెలబ్రెటీలు మరియు బయట నాని కూడా ఆకట్టుకోలేక పోతున్నారు అని, అందుకే షోకు మసాలా యాడ్‌ చేసేందుకు నిర్వాహకులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజాగా బిగ్‌బాస్‌ ఇంటికి ఎన్టీఆర్‌ను పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఎన్టీఆర్‌ మొదటి సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించాడు. ఆయన్ను ఇంట్లోకి ఒక రోజు పంపించడం వల్ల షోకు ఒక్కసారిగా క్రేజ్‌ తీసుకు రావచ్చనే ఉద్దేశ్యంతో షో నిర్వాహకులు ఉన్నారు.

బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో మొదటి రోజే ఎన్టీఆర్‌ను చూపించాలని భావించారు. అయితే నాని ప్రత్యేకత వెలుగులోకి రాదని, మొదటి రోజే ఎన్టీఆర్‌ వస్తే ఫోకస్‌ చేంజ్‌ అవుతుందని భావించారు. అందుకే మొదటి రోజు కాకుండా ఇప్పుడు ఎన్టీఆర్‌ను తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో షో నిర్వాహకులు ఉన్నారు. ప్రస్తుతం బిగ్‌బాస్‌ షో నిదానంగా, నిద్రపోతున్నట్లుగా సాగుతుంది. అందుకే ఎన్టీఆర్‌ను షోలో ఒక్కసారి ఎంటర్‌ చేస్తే ఒక్కసారిగా దూసుకు పోయే అవకాశం ఉందని వారు అనుకుంటున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.