ఎన్టీఆర్‌ బ్యాక్‌ టు బ్యాక్‌ మల్టీస్టారర్స్‌     2018-06-13   22:19:26  IST  Raghu V

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ‘జైలవకుశ’ చిత్రం తర్వాత ఎట్టకేలకు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్నాడు. ఆరు నెలల విరామం తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు ‘అరవింద సమేత’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దసరాకు ఆ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో దర్శకుడు మునిగి ఉన్నాడు.

ఇక అరవింద సమేత చిత్రం తర్వాత ఎన్టీఆర్‌ టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌తో కలిసి ఒక మల్టీస్టారర్‌ను చేయబోతున్నాడు. అందుకు సంబంధించిన కథా చర్చలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో ఈ భారీ మల్టీస్టారర్‌ను పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తెలుగు ప్రేక్షకులకు మల్టీస్టారర్‌ మూవీస్‌ అంటే పిచ్చి ఇష్టం అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలో పెద్దగా మ్యాటర్‌ లేకున్నా కూడా మంచి స్టార్‌కాస్టింగ్‌తో, ఇద్దరు పెద్ద హీరోలతో సినిమా వస్తే తప్పకుండా ఆ సినిమాను ప్రేక్షకులు ఆధరిస్తారు. ఆ విషయం గతంలో పలు సార్లు వెళ్లడి అయ్యింది. అందుకే ఈ మద్య వరుసగా మల్టీస్టారర్‌ చిత్రాలు వస్తున్నాయి. నాగ్‌, నానిల మల్టీస్టారర్‌తో పాటు వెంకీ, వరుణ్‌ మరియు వెంకీ, చైతూల మల్టీస్టారర్‌లు తెర రూపం దాల్చుతున్నాయి. ఇలాంటి సమయంలోనే మరో మల్టీస్టారర్‌ గురించిన ఆసక్తికర ప్రకటన కళ్యాణ్‌ రామ్‌ చేసి అందరిలో చర్చకు తెర లేపాడు.