NTR advised Deeksha Panth to go glamorous in Bigg Boss house

ప్రసారమైన మొదటి రోజే రికార్డు స్థాయి టీఆర్పీ సాధించింది బిగ్ బాస్. అంతా ఎన్టీఆర్ స్టార్ డం వల్లే. ఆ తరువాత కూడా టీఆర్పీ బాగున్నా, మరీ ఆశించిన స్థాయిలో లేదు. దీనికి కారణాలు అనేకం. పిచ్చి పిచ్చిగా ఆసక్తి రేకెత్తించే వివాదాలు ఎక్కువ జరగలేదు ఇప్పటివరకు. సంపూర్నేష్ బాబు వెళ్ళిపోవడం కూడా పెద్ద లోటు. ఇప్పుడిప్పుడే ప్రిన్స్ – అర్చనల కొత్త లవ్ స్టోరి వలన బిగ్ బాస్ ఇంటరెస్టింగ్ గా మారుతోంది. కాని ఎంతకాలం ? కేవలం వీకెండ్ వచ్చే ఎన్టీఆర్ ఎంత అని లాగుతాడు షోని ? కేవలం తన మీదే ఆధారపడితే ఎలా ? ఇంట్లో మసాలా – వివాదం .. ఇవన్ని ఉంటేనే షో సూపర్ హిట్ అయ్యేది. 70 రోజులు నడిచే షో అన్నప్పుడు ప్రేక్షకులకి బోర్ కొట్టకుండా చూడటం పెద్ద ఛాలెంజ్. అందులోనూ జనాలకి అలవాటైన జబర్ దస్త్ ధాటిని తట్టుకొని నిలబడాలి షో. తెలుగు బిగ్ బాస్ కథ ఇలా ఉంటే, తమిళ బిగ్ బాస్ కథ మరోలా ఉంది.

అక్కడ కేవలం కమల్ హాసన్ మీద నడవట్లేదు షో. ఒవియా అనే అమ్మాయి పెద్ద స్టార్ అయ్యి కూర్చుంది. ఆమె అందం, చలాకీతనం షోకి పిచ్చి టీఆర్పీ తీసుకొస్తోంది. కమల్ రాని వారంలోని అయిదు రోజులు కూడా తీఆర్పి అదిరిపోతోంది. అందుకు కారణం ఒవియా. ఈ అమ్మాయి బిగ్ బాస్ ఇంట్లోంచి బయటకి రాగానే, నేను ఛాన్స్ ఇస్తానంటే, నేను ఛాన్స్ ఇస్తానంటూ పోటిపడుతున్నారు తమిళ దర్శకనిర్మాతలు. అలాంటి గ్లామర్ పవర్ తెలుగు బిగ్ బాస్ లో కరువైంది.