“భారత ఎన్నారై” లు..స్వదేశానికి పంపే సొమ్ము తెలిస్తే షాకే     2018-05-14   02:40:42  IST  Bhanu C

మనోళ్ళు మాములోళ్ళు కాదురోయ్ అని మనం సహజంగా అనుకుంటాం అయితే ఇప్పుడు ప్రపంచ దేశాలు ముక్త ఖంటంతో చెప్తున్నాయి భారత ఎన్నారైలు మాములోళ్ళు కాదని..ఎందుకంటే విదేశీ వీసాల నుంచీ విద్యా,ఉద్యోగాల వరకూ..పోటీ తత్వంలో నెగ్గటం నుంచీ రాజకీయాలలో సాధిస్తున్న విజయాల వరకూ అన్ని రంగాలలలో విదేశాలలో భారతీయులు పాత్ర ఎంతో కీలకంగా మారింది..అన్ని రంగాలలో భారతీయులే టాప్ లిస్టు లో ఉన్నారు..

అయితే తాజాగా వెలువడిన ఒక నివేదికలో సైతం భారత ఎన్నారైలె ముందు నిలిచారట..మరి ఆనివేదిక ఏమిటంటే.. విదేశాల్లో ఎంతో కష్టపడి పని చేసుకుని సంపాదిస్తున్న సొమ్ముని భారత ఎన్నారైలు స్వదేశానికి పంపుతున్నారు ఇలా గత ఏడాది అంటే 2017 వీరు పంపించిన మొత్తం 6,900 కోట్ల డాలర్లు. ప్రస్తుత డాలర్‌ మారకం రేటు ప్రకారం చూస్తే ఇది దాదాపు రూ.4.62 లక్షల కోట్లకు సమానమని అన్నారు ఈ లెక్కలు చూసి విదేశీయులకి చుక్కలు కనిపించాయట.