Now men can switch on and switch off sperm release

అందరు దంపతుల జీవితంలో ఒక స్టేజి వస్తుంది. అప్పుడు పిల్లల ఇకపై వద్దు అని డిసైడ్ అవుతారు. కాని ఇద్దరికి సెక్స్ కావాలి. మరి పిల్లలు పుట్టకూడదు అంటే? కండోమ్ వాడటం ఇద్దరిలో ఎవరికి పెద్దగా నచ్చకపోవచ్చు. గర్భనిరోధక మాత్రలు అతిగా వాడితే స్త్రీ శరీరానికి మంచిది కాదు. ఇలాంటప్పుడు మొదలయ్యే సమస్యే, ఇద్దరిలో ఎవరు ఆపరేషన్ చేయించుకోవాలి? చాలామంది భార్యభర్తలు ఈ విషయంలో గొడవ కూడా పడతారు. నిజానికి ఇదే చాలా పెద్ద ప్రశ్నే. కాని గర్భధారణలో ఇప్పటికే భరించలేని నొప్పులని అనుభవించంది భార్య. కాబట్టి ఈసారి నొప్పులని భర్త అనుభవించడమే కరెక్టు.

అలా సరైన పద్ధతిలో అలోచించిన మగవారే వెసెక్టోమి ఆపరేషన్ కి వెళ్ళి, తండ్రి అయ్యే యోగ్యతని త్యాగం చేస్తారు. ఈ ఆపరేషన్ తరువాత పురుషుల కొన్ని రకాల నొప్పులు అనుభవించాల్సి ఉంటుంది. అవి జీవితాంతం వెంటాడవచ్చు కూడా. అందుకే ఆపరేషన్ అవసరం లేకుండా తండ్రి అయ్యే యోగ్యత ఇష్టమున్నప్పుడు కోల్పోవడానికి, మళ్ళీ ఇష్టమున్నప్పుడు తిరిగి పొందడానికి ఓ సరికొత్త టెక్నిక్ ని కనిపెట్టారు వాషింగ్‌టన్ డాక్టర్లు.