“నో H4 EAD వర్క్ పర్మిట్” ‘భారతీయులకి’ ట్రంప్ మరో “షాక్”..     2018-04-24   06:10:50  IST  Bhanu C

అమెరికా కి ఎందుకు వెళ్ళామని ఎన్నారైలు అనుకునే విధంగా ట్రంప్ సర్కార్ చర్యలు చేపడుతోంది..హెచ్‌1 బీ వీసాదారులకు ట్రంప్‌ సర్కార్‌ మరోసారి షాక్‌ ఇవ్వనుంది…ఇప్పటికే షాకుల మీద షాకులు ఇస్తూ భారతీయ ఎన్నారైలని కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ట్రంప్ సర్కార్ మరో మారు వర్క్ పర్మిట్ వీసా విషయంలో అలజడిని సృష్టించానికి మరొక ప్రకటన చేసింది.

“నో H4 EAD వర్క్ పర్మిట్” ‘భారతీయులకి’ ట్రంప్ మరో “షాక్”..

ట్రంప్ H4 EAD వర్క్ పర్మిట్ వీసాదారులను నిరోధించేందుకు చర్యలు చేపట్టనున్నట్టుగా తెలుస్తోంది…హెచ్‌1-బీ వీసా హోల్డర్స్ జీవిత భాగస్వాములు అమెరికాలో H4 EAD తో చట్టబద్ధంగా పనిచేయకుండా నిరోధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని..ఈ ప్రణాళిక గనుకా సిద్దం అయితే ఇక పూర్తిగా వర్క్ పర్మిట్ పై ఆక్షంలు అమలులోకి వచ్చినట్టే..