రామ్‌ చరణ్‌ సంచలన నిర్ణయం     2018-05-25   01:19:00  IST  Raghu V

టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్‌ హీరోల మద్య తీవ్ర పోటీ ఉండేది. అయితే ఆ పోటీ ఆరోగ్యకర పోటీ అయితే కాదని చెప్పుకోవచ్చు. ఒకరిపై ఒకరు డామినేషన్‌ ప్రదర్శించడం, తమ సినిమాలు రికార్డు సాధించాయి అంటే తమ సినిమాలు రికార్డులు దక్కించుకున్నాయి అంటూ ఒకరిపై ఒకరు పై చేయి కోసం తెర వెనుక విశ్వ ప్రయత్నాలు చేసేవారు. పైకి సాదారణంగా కనిపించినా కూడా లోలోపల మాత్రం రికార్డుల విషయంలో స్టార్‌ హీరోల మద్య ఈగో ఎక్కువగా ఉండేది. గతంలో ప్రతి సినిమా కూడా ఇన్ని రోజులు ఆడినది, ఇన్ని థియేటర్లలో ఆడినది, ఇన్ని కలెక్షన్స్‌ సాధించింది అంటూ ప్రచారం చేసేవారు.

ప్రస్తుత పరిస్థితి మారింది, ప్రస్తుత స్టార్‌ హీరోల మద్య పోటీ అయితే ఉంది కాని అది ఆరోగ్యవంతమైన పోటీ. స్టార్‌ హీరోలు ఒకరి సినిమాను ఒకరు ఎంకరేజ్‌ చేసుకోవడం, ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించడం, ఒకరి సినిమా వేడుకలకు మరొకరు హాజరు కావడం వంటివి చేస్తున్నారు. ఇక రికార్డులు, కలెక్షన్స్‌ కూడా హీరోలు పట్టించుకోవడం లేదు. ఆ విషయాలను నిర్మాతలు కాస్త అత్యుత్సాహం చూపిస్తూ రికార్డులు అంటూ వేసుకుంటున్నారు. అంతే తప్ప హీరోలు మహేష్‌బాబు, రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ వంటి వారు వాటిపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు.