అన్ని సోది సినిమాలే.. దసరా వరకు సందడి లేనట్లే     2018-06-05   01:17:09  IST  Raghu V

తెలుగు సినిమాకు ఈ సంవత్సరం అంతగా కలిసి వస్తున్నట్లుగా అనిపించడం లేదు. ఈ సంవత్సరం ప్రారంభం అయ్యి అయిదు నెలలు పూర్తి అయ్యింది. ఇప్పటి వరకు సూపర్‌ హిట్స్‌ ఎన్ని అంటే వేల్ల మీద లెక్క పెట్టవచ్చు. నెలకు ఒక్కటి చొప్పున కూడా సూపర్‌ హిట్‌ చిత్రాలు రాలేదు. దారుణమైన పరిస్థితిని ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటుంది. భరత్‌ అనే నేను, రంగస్థలం, మహానటి చిత్రాలు ఇంకా రెండు మూడు చిన్న చిత్రాలు పర్వాలేదు అనిపించాయి మినహా విడుదలైన ఇతర చిత్రాలు అన్ని కూడా బాక్సాఫీస్‌ ముందు బొక్క బోర్లా పడ్డాయి.

ఇదే పరిస్థితి రాబోయే రోజుల్లో కూడా కనిపించబోతుంది. సంక్రాంతికి విడుదలైన సినిమాలు ఢమాల్‌ అయ్యాయి. కాని దసరాకు రాబోతున్న సినిమాలు మాత్రం బాగుంటాయని అంతా భావిస్తున్నారు. దసరా ముందు వచ్చే చిన్న చితక సినిమాలు అన్ని కూడా అట్టర్‌ ఫ్లాప్‌ ఫ్లాప్‌ అయ్యే విధంగానే కనిపిస్తున్నాయి. రెండు మూడు పెద్ద హీరోల సినిమాలు ఉన్నాయి. కాని అవి ఏమాత్రం ఆకట్టుకుంటాయో మాత్రం తెలియడం లేదు. తెలుగులో ఇలాంటి పరిస్థితి రావడం చాలా దారుణం అని ఈ సంవత్సరం మొత్తంలో కనీసం పది హిట్‌లు అయినా పడతాయా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.