No Discipline In TDP

ఏపీలో అధికార టీడీపీలో క్ర‌మ‌శిక్ష‌ణ పూర్తిగా గాడి త‌ప్పేసింది. ఒక‌ప్పుడు టీడీపీ అంటే క్ర‌మ‌శిక్ష‌ణ‌కు ఎంతో మారుపేరు. 2014 ఎన్నిక‌ల్లో గెలిచి చంద్ర‌బాబు సీఎం అయ్యాక ఇక్క‌డ క్ర‌మ‌శిక్ష‌ణ అనే ప‌దం క‌రువైంది. ఎవ‌రికి వారు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తూ అధినేత ఆదేశాల‌ను ధిక్క‌రిస్తున్నారు. ఏపీలో 13 జిల్లాల్లోను ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. పార్టీలోకి వైసీపీ నుంచి ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించ‌డం, వారికి మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌డంతో ఈ అసంతృప్తి జ్వాలా కుంప‌టి ఒక్క‌సారిగా అంటుకుంది.

పాత, కొత్త నాయ‌కుల మ‌ధ్య అస్స‌లు పొస‌గ‌డం లేదు. ఇక మధ్యలో వచ్చిన వారి నాయకత్వం తాము అంగీకరించబోమని తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు బహిరంగంగానే చెబుతున్నారు. క్ర‌మ‌శిక్ష‌ణ ఉల్లంఘిస్తే వేటేస్తామ‌ని బాబు చెపుతున్నా ఆయ‌న మాట‌లు అస్స‌లు లెక్క చేయ‌డం లేదు. శ్రీకాకుళం జిల్లాలో సీనియ‌ర్ నేత గౌతు శ్యాంసుంద‌ర్ శివాజీ, కళా వెంక‌ట్రావు, అచ్చెన్నాయుడిది త‌లోదారి. విజ‌య‌న‌గ‌రంలో కేంద్ర మంత్రి అశోక్‌కు జిల్లా ఎమ్మెల్యేల‌కు పొస‌గ‌డం లేదు.