బాబు అస్సలు మారలేదు ! ఇదే సాక్ష్యం     2018-05-24   01:59:59  IST  Bhanu C

ఏపీ సీఎం చంద్రబాబు స్టయిలే వేరు . ఆయన్ను ఎన్నిరకాలుగా ఇరుకునపెట్టే విషయాల గురించి అడిగినా ఆయన మాత్రం ఏ మాత్రం కంగారు పడరు. ఆయన చెప్పాలి అనుకున్నదే చెప్తారు తప్ప అడిగినదానికి మాత్రం సమాధానం చెప్పరు. ఇదే బాబు స్టయిల్ . ప్రతిపక్షాలు విమర్శించినట్టుగానే ఆయన ఎప్పుడూ రెండుకళ్ల సిద్ధాంతాన్నే ఫాలో అవుతుంటారు. ఇదే ఆయనకు ఉన్న ప్లస్ అండ్ మైనెస్. ఒకప్పుడు రాష్ట్ర విభజన విషయంలోనూ ఆంధ్రాలో సమైక్యాంధ్రా అంటూనే రాష్ట్రాన్ని విభజించాలని కేంద్రానికి లేఖ రాస్తారు. ఇక్కడేమో సమైక్యాంధ్ర కోసం పోరాడమని చెప్తారు. తెలంగాణకెళ్తే.. నేనిచ్చిన లేఖ వల్లే తెలంగాణ వచ్చిందంటారు. ఇలా ఎక్కడికక్కడ ప్లేట్ ఫిరాయించడం బాబుకు ముందు నుంచి ఉన్న అలవాటే.

బీజేపీతో తెగతెంపులు చేసుకున్నాక కూడా బాబు ఇలాగే వ్యవహారం నడుపుతున్నాడు. లోకల్ మీడియాతో బీజేపీపై నిప్పులు చెరుగుతున్న ఆయన జాతీయ మీడియా విషయాకొచ్చేసరికి చల్లబడి పోతున్నారు. అసులు బీజేపీతో పొత్తు కొనసాగుతుందా అని ఏ విలేకరి అయినా.. ప్రశ్నిస్తే.. పొంతన లేకుండా సమాధానం చెప్తారు. కానీ, బీజేపీతో మాత్రం తెగదెంపులు చేసుకున్నామని మాత్రం చెప్పరు. కానీ కర్ణాటకలో బీజేపీ కి నావల్లే ఈ పరిస్థితి తలెత్తింది అని గొప్పగా మాత్రం చెప్పుకుంటున్నాడు.