ఎన్టీఆర్‌ చిత్రంలో అక్కినేని వారసులు ఉండరు.. ఎందుకంటే     2018-07-03   05:05:39  IST  Raghu V

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కబోతున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో ఏయన్నార్‌ పాత్రను ఆయన మనవడు నాగచైతన్య పోషించబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. ‘మహానటి’ చిత్రంలో ఏయన్నార్‌ పాత్రను నాగచైతన్య పోషించగా మంచి మార్కులు పడ్డాయి. దాంతో ఎన్టీఆర్‌ చిత్రంలో కూడా ఏయన్నార్‌ పాత్రను నాగచైతన్యతో చేయించాలని దర్శకుడు క్రిష్‌ భావించాడు. అయితే నాగచైతన్య అందుకు నో చెప్పినట్లుగా తెలుస్తోంది.

నాగచైతన్య నో చెప్పడంతో ఏయన్నార్‌ మరో మనవడు అయిన సుమంత్‌ను ఆ విషయమై సంప్రదించడం జరిగింది. అందుకు ఆయన కూడా నో చెప్పినట్లుగా సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీకి బాలకృష్ణకు సన్నిహిత సంబంధాలు లేవు అని, అందుకే ఎన్టీఆర్‌ చిత్రంలో అక్కినేని కుటుంబీకులు నటించేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. చాలా కాలంగా బాలకృష్ణ మరియు నాగార్జునల మద్య విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాల కారణంగానే సినిమాలో నటించేందుకు అక్కినేని వారసులు నో చెబుతున్నారు.