మీరు చేసే పూజలకు రెట్టింపు ఫలితం రావాలంటే ఏమి చేయాలి?

ప్రతి ఒక్కరు దేవుని కృప కోసం నియమ నిష్టలతో పూజలు చేస్తూ ఉంటారు. అయితే పూజ చేసే సమయంలో కొన్ని నియమాలను పాటిస్తే రెట్టింపు ఫలితాలను పొందవచ్చు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

పూజ గదిని శుభ్రంగా ఉంచుకోవాలి. ముందు రోజు పూజ చేసిన అక్షంతలు మరియు పువ్వులు లేకుండా శుభ్రం చేసుకోవాలి.

దేవుడి గదిలో దేవుని విగ్రహాలను శుభ్రం చేసాక బొట్టు పెట్టి పువ్వులతో అలంకరించాలి. బొట్టు పెట్టటానికి గంధం ఉపయోగిస్తే మంచిది.

శివునికి విభూతి,విష్ణవుకి గంధం పెట్టాలి.

దీపారాధన చేసేటప్పుడు నూనె పోసాక ఒత్తులను వేయాలి.

దీపారాధనకు వెండి లేదా రాగి లేదా బంగారం కుందులను వాడితే మంచిది.

కుందెలో మూడు ఒత్తులను వేసి వెలిగించాలి. ఒక ఒత్తు వేసి వెలిగించకూడదు. కుందెను కింద పెట్టకుండా పళ్లెం లేదా తమలపాకులో పెట్టాలి.

,