దిల్‌రాజు చెత్త నిర్ణయం.. నితిన్‌ టెన్షన్‌     2018-05-11   01:38:11  IST  Raghu V

గత సంవత్సరంలో దిల్‌రాజు వరుసగా భారీ విజయాలను దక్కించుకుని టాలీవుడ్‌ మోస్ట్‌ సక్సెస్‌ ఫుల్‌ నిర్మాతగా పేరు తెచ్చుకున్న విషయం తెల్సిందే. దిల్‌రాజు వరుస విజయాలకు చిన్న బ్రేక్‌ వేశాడు. ఈ సంవత్సరం దిల్‌రాజు నుండి పూర్తి స్థాయి సినిమా రాలేదు. ఈ సంవత్సరంలో దిల్‌రాజు బ్యానర్‌ నుండి రాబోతున్న మొదటి సినిమా ‘శ్రీనివాస కళ్యాణం’. గత సంవత్సరం సంక్రాంతికి వచ్చిన శతమానం భవతి చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సతీష్‌ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ అంచనాలున్న ఈ సినిమా ఇటీవలే ప్రారంభం అయ్యింది. అయ్యింది. స్టార్‌ హీరోతో సినిమాలని భావించినప్పటికి కొన్ని కారణాల వల్ల నితిన్‌తో చేయాల్సి వచ్చింది.

నితిన్‌, రాశిఖన్నా జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆశ్చర్యకరంగా విడుదలకు సిద్దం అయ్యింది అంటూ ప్రకటన వచ్చింది. గత సంవత్సరం జూన్‌లో దిల్‌రాజు బ్యానర్‌లో తెరకెక్కిన ‘ఫిదా’ చిత్రం విడుదల అయ్యింది. ఇప్పుడు అదే తేదీన అంటే జూన్‌ 21న శ్రీనివాస కళ్యాణంను విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. సహజంగా అయితే దిల్‌రాజు తన సినిమాల విడుదల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత ఒకటికి రెండు సార్లు క్రాస్‌ చెక్‌ చేసుకుని మరీ విడుదల చేస్తాడు. దిల్‌రాజు బ్యానర్‌లో వచ్చిన పలు సినిమాలు రీ షూట్‌ జరుపుకున్నాయి. ఆ సినిమాలు మంచి విజయాన్ని దక్కించుకున్నాయి. కాని ఈ సినిమాను మాత్రం దిల్‌రాజు తొందరపెట్టి మరీ పూర్తి చేయిస్తున్నాడు.