పవన్‌పై అభిమానంతో నితిన్‌ చెత్త నిర్ణయం     2018-05-23   00:26:44  IST  Raghu V

పవన్‌ కళ్యాణ్‌ అంటే తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న పలువురు యువ హీరోలకు చాలా అభిమానం. మెగా ఫ్యామిలీ హీరోలతో పాటు ఇతరులు కూడా పవన్‌ కళ్యాణ్‌పై అభిమానంను సందర్బానుసారంగా వ్యక్తం చేస్తూ ఉంటారు. యువ హీరోల్లో పవన్‌కు వీరాభిమాని ఎవరు అంటే ప్రతి ఒక్కరు ఠక్కున చెప్పే సమాధానం నితిన్‌. అవును, నితిన్‌ తన ప్రతి సినిమాలో కూడా పవన్‌ను ఇమిటేట్‌ చేయడం, పవన్‌పై తనకున్న అభిమానంను వ్యక్తం చేయడం చేస్తూ ఉంటాడు. పవన్‌పై ఉన్న అభిమానంతో నితిన్‌ తీసుకునే కొన్ని నిర్ణయాలు సిల్లీగా అనిపిస్తాయి. కాని అదంతా కూడా తాను పవన్‌పై అభిమానంతో చేస్తున్నాను అంటూ ఆయన చెప్పుకొస్తాడు.

సినిమాల్లో పవన్‌ను ఎలా అయితే ఇమిటేట్‌ చేస్తాడో, నిజ జీవితంలో కూడా పవన్‌ను అనుసరించేందుకు ప్రయత్నిస్తాడు. పవన్‌ కళ్యాణ్‌ గతంలో కరుణాకరన్‌ దర్శకత్వంలో ఒక సినిమాను చేశాడు. దాంతో నితిన్‌ కూడా ఆయన దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని కోరుకున్నాడు. ఆయన సక్సెస్‌లో లేడని, వరుసగా ఫ్లాప్‌లు చేస్తున్నాడని తెలిసినా కూడా కరుణాకరన్‌తో సినిమా చేశాడు. అంతా భావించినట్లుగానే అది నితిన్‌ను నిరాశ పర్చింది. అయినా కూడా పవన్‌ దర్శకుడితో తానో సినిమా చేశాను అనే సంతృప్తి నితిన్‌ పొందాడు. ఇప్పుడు మరోసారి అదే నిర్ణయం తీసుకుని విమర్శలు ఎదుర్కొంటున్నాడు.