నిఖిల్ కేశవ సినిమా వింత స్టోరి ఇదే అంటా

కొత్తరకం సినిమాలతో దూసుకుపోతున్న యువకథానాయకుడు నిఖిల్. ఈమధ్యే ఎక్కడికి పోతావు చిన్నవాడ రూపంలో బంపర్ హిట్ అందుకున్నాడు నిఖిల్. ఈ డిఫరెంట్ సినిమా తెలుగు ప్రేక్షకులని ఎంతలా ఆకట్టుకుందంటే, ఈ చిత్రం యొక్క సాటిలైట్ హక్కులు ఏకంగా 4 కోట్లకు అమ్ముడుపోయాయి.

ఇదిలా ఉంటే, నిఖిల్ తనకు స్వామిరారా లాంటి బ్లాక్బస్టర్ ని అందించిన సుధీర్ వర్మతో మరో కొత్తరకమైన చిత్రం కేశవ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం మరో వినూత్న కథతో తెరకెక్కుతోంది. నిజానికి ఈ చిత్రం యొక్క ఇదే అని ఓ వింత కథ ప్రచారంలో ఉంది.

ఆ కథ ప్రకారం, మిగితా మనుషుల్లా కాకుండా, నిఖిల్ గుండె కుడివైపుకు ఉంటుందట. దాంతో, కోపం, బాధ లాంటి విపరీతమైన ఎమోషన్స్ ని తట్టుకునే శక్తి తనకి ఉండదట. అలాంటి నిఖిల్ విలన్లపై పగ తీర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందట. మరి ఎలాంటి కోపాన్ని బయటపెట్టకుండా, చల్లగా నిఖిల్ పని ఎలా కానిచ్చాడు అనేది ఈ సినిమా కథ అని టాక్.

బహుషా అందుకేనేమో, కేశవ పోస్టర్స్ మీద “Revenge is a dish better served cold” అనే ట్యాగ్ లైన్ కనబడుతోంది. అంటే, “పగ అనే వంటకాన్ని చల్లగా వడ్డిస్తేనే బాగుంటుంది” అని అర్థం.