సైరాలో మెగా డాటర్‌ పాత్రపై క్లారిటీ.. రచ్చ చేసేందుకు సిద్దం అంటోంది     2018-09-12   12:59:58  IST  Ramesh P

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డిలో పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు దాదాపు సంవత్సర కాలంగా సాగుతున్నాయి. ఇక ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో మెగా డాటర్‌ నిహారిక కనిపించబోతున్న విషయం తెల్సిందే. తాజాగా సినిమాకు సంబంధించిన ఒక న్యూస్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంలో అంచనాలకు తగ్గట్లుగా తాను అలరిస్తాను అంటూ మొదటి నుండి చెబుతూ వస్తున్న ముద్దుగుమ్మ నిహారిక తాజాగా ఈ చిత్రంతో అలరించేందుకు సిద్దం అవుతుంది.

Niharika Konidela,Niharika Konidela Going To Rock In Sye Raa Narasimha Reddy,Sye Raa Narasimha Reddy

నిహారిక ఈ చిత్రంలో కథకళి డాన్సర్‌గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. పావు గంట పాటు సినిమాలో కనిపించే ఈ అమ్మడు గత రెండు నెలలుగా కథకళి డాన్స్‌ను ప్రాక్టీస్‌ చేస్తుందట. సినిమాలో చిన్న పాత్ర అయినా కూడా కీలకమైన పాత్ర అవ్వడం వల్ల నిహారిక చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా సమాచారం అందుతుంది. చిరంజీవితో కలిసి నటించేందుకు చాలా ఆసక్తిగా ఎదురు చూసిన నిహారికకు కాస్త ఆలస్యంగా అయినా మంచి పాత్ర దక్కింది అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

హీరోయిన్‌గా నటించిన రెండు చిత్రాలు కూడా నిరాశ పర్చడంతో ఈ చిత్రంపై నిహారిక చాలా ఆశలు పెట్టుకుంది. అంచనాలకు తగ్గట్లుగా సినిమా అలరిస్తుందనే నమ్మకంతో సినీ వర్గాల వారు ఉన్నారు. ఇక ఈ చిత్రంలో నిహారికతో పాటు అమితాబచ్చన్‌, సుదీప్‌, విజయ్‌ సేతుపతి, తమన్నా, నయనతార ఇంకా పలువురు ప్రముఖ నటీనటులు కనిపించబోతున్నారు.

Niharika Konidela,Niharika Konidela Going To Rock In Sye Raa Narasimha Reddy,Sye Raa Narasimha Reddy

సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం రికార్డు స్థాయిలో వచ్చే సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన యుద్ద సన్నివేశాల చిత్రీకరణకు విదేశాలకు వెళ్తున్నారు. ఈ సంవత్సరం చివరి వరకు సినిమా టాకీ పార్ట్‌ పూర్తి కాబోతుంది. జనవరి లేదా ఫిబ్రవరికి షూటింగ్‌ మొత్తం పూర్తి చేయాలని దర్శకుడు సురేందర్‌ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు.