Nene Raju Nene Mantri Review

చిత్రం : నేనే రాజు నేనే మంత్రి
బ్యానర్ : సురేష్ ప్రొడక్షన్స్ & బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్
దర్శకత్వం : తేజ
నిర్మాతలు : సురేష్ బాబు, భరత్ చౌదరీ & వి. కిరణ్ కుమార్ రెడ్డి
సంగీతం : అనూప్ రూబెన్స్
విడుదల తేది : ఆగష్టు 11, 2017
నటీనటులు : రానా దగ్గుబాటి, కాజల్ అగర్వాల్, కాథరీన్, నవదీప్ తదితరులు

కథలోకి వెళితే :


జోగేంద్ర (రానా) ఓ పల్లెటూరిలో వడ్డీవ్యాపారం చేస్తూ ఉంటాడు. మంచి మనసు అతని సొంతం. మామూలు జీవితం గడుపుతున్న జోగేంద్రకి రాజకీయాల్లోకి వెళ్ళాలనే బలమైన కోరిక పుడుతుంది. దానికి కారణం ఊరి సర్పంచి చేతిలో తనకు జరిగిన అవమానం. రాధ (కాజల్) ని పెళ్ళి చేసుకోని రాధ జోగేంద్రగా మారిన కథానాయకుడు సియ్యం (తనికెళ్ళభరణి) క్యాబినెట్ లో మంత్రిగా తన రాజకీయ జీవితం మొదలుపెడతాడు. కాని మంత్రి పదవి కాదు జోగేంద్రకి కావాల్సింది. చీఫ్ మినిస్టర్ పదవి అతడి లక్ష్యం. మరి ఆ లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలో జోగేంద్ర ఎన్ని ఎత్తులు వేసాడు, ఎన్ని కుయక్తులు పన్నాడు. అతడి రాజకీయ జీవితం ఎలాంటి ఒడిదుడుకులు చూసింది తెర మీద చూడండి.