మాస్ మహారాజ్ రవితేజ నటించిన "నేల టికెట్" హిట్టా.? స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో).!     2018-05-24   23:53:19  IST  Raghu V

Movie Title (చిత్రం): నేల టికెట్ (nela ticket)

Cast & Crew:

నటీనటులు: రవితేజ, మాళవిక శర్మ, జగపతి బాబు తదితరులు
దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణ
సంగీతం: కార్తీక్
నిర్మాత: రామ్ తాళ్లూరి

STORY:

ఆదిత్య భూపతి (జగపతి బాబు) మినిస్టర్ పదవికి ప్రమాణస్వీకారం చేసే సీన్ తో “నేల టికెట్” సినిమా స్టార్ట్ అవుతుంది. ఓ అనాధగా రవితేజ పరిచయం అవుతాడు. లేనివారికి సహాయం చేయడంలో సంతోషం వెతుక్కుంటూ ఉంటాడు. రవితేజ కథని ఓ వైపు, జగపతి బాబు ని మరో వైపు చూపిస్తూ సినిమా ముందుకి కదుల్తుంది. ఇంతలో వైజాగ్ నుండి హైదరాబాద్ కి వస్తాడు రవితేజ. అక్కడ హీరోయిన్ మాళవిక శర్మ ను చూస్తాడు. మొదటి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఇది ఇలా ఉండగా జగపతి బాబు ని కలిసి రవితేజ వార్నింగ్ ఇస్తాడు. అసలు వారిద్దరికీ గొడవేంటి అనేది ఫ్లాష్ బ్యాక్. చివరికి హోమ్ మినిస్టర్ జగపతి బాబుని రవితేజ ఎలా ఓడించాడు అనేది తెలియాలంటే “నేల టికెట్” సినిమా చూడాల్సిందే!

REVIEW:

రవితేజ ఎనర్జీకి తగ్గట్లుగానే దర్శకుడు ఆయన క్యారెక్టర్‌ను మలిచారు. డెబ్యూ బ్యూటీ మాళవిక శర్మ అందాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. తొలిచిత్రం తోటే మాస్ ఆడియన్స్‌తో విజిల్స్ వేయించింది. వాళ్లు కోరుకునే వాటిని లోటు లోకుండా ఆరబోసి కనువిందు చేసింది. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది.. ముఖ్యంగా జగపతిబాబు, రవితేజలు పోటీ పడి నటించారంటున్నారు. వీళ్ల మధ్య ఆధిపత్య పోరుతో సినిమా గ్రిప్పింగ్‌లోకి వెళ్లిందంటున్నారు. ఇక బ్రహ్మానంద, అలీ కామెడీ బాగా పండింది. ఇక ఫిదా ఫేమ్ శక్తికాంత్ అందించిన పాటలు బాగున్నాయి.