జోక్‌ : ‘నేలటిక్కెట్టు’కు హౌస్‌ఫుల్‌     2018-05-29   23:43:42  IST  Raghu V

రవితేజ, మాళవిక శర్మ జంటగా కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నేలటిక్కెట్టు’. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు మొదటి ఆటకే నెగటివ్‌ టాక్‌ వచ్చింది. బ్యాడ్‌ రివ్యూస్‌ మరియు నెగటివ్‌ టాక్‌తో సినిమా కలెక్షన్స్‌ రెండవ షో నుండే పడిపోయాయి. మొదటి రోజు కాస్త పర్వాలేదు అన్నట్లుగా వచ్చినా రెండవ రోజు నుండి మినిమం కలెక్షన్స్‌ కూడా రాలేదు. శని, ఆదివారాలు కూడా సినిమాకు ఆశాజనకంగా కలెక్షన్స్‌ను రాబట్టలేక పోయింది.

‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ చిత్రాతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న కళ్యాణ్‌ కృష్ణ తాజాగా ఈ చిత్రంతో మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు. కథ, కథనం అన్ని కూడా కూడా మూస పద్దతిలో ఉన్నాయని, ఏమాత్రం ఆకట్టుకోని కథనంతో సినిమాను తెరకెక్కించాడు అంటూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రవితేజ వంటి మాస్‌ హీరోను చూపించడంలో కళ్యాణ్‌ కృష్ణ విఫలం అయ్యాడు. అలాగే రవితేజ బాడీలాంగ్వేజ్‌ పర్వాలేదు అన్నట్లుగా ఉన్నా ఆయన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లుగా క్లీయర్‌గా అనిపిస్తుంది. ఇవన్ని కలిసి సినిమా ఒక ఫ్లాప్‌ సినిమాగా మిగిలి పోయింది.