మోడీ పై ఆ ముగ్గురి భారీ ప్లాన్..బయటపెట్టిన రిపబ్లికన్ టీవీ     2018-04-07   02:36:36  IST  Bhanu C

ప్రత్యేక హోదా ఇప్పుడు అన్ని పార్టీలకి ఇదే మంత్రం అయ్యింది..ఏపీ లో ఉన్న పార్టీలు మాత్రమే కాదు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ సైతం పాత గాయాన్ని మాపుకోవడానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేస్తోంది..ఇప్పుడు ఇది జాతీయ స్థాయిలో ఒక పెద్ద అంశంగా మారిపోయింది..హోదా అంశంపై మోడీ సర్కారుపై అవిశ్వాస తీర్మానాన్ని లోక్ సభలో వరుసపెట్టి పెట్టినా…చర్చకు రాకుండా చేయటం ద్వారా మోడీ సర్కార్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అయితే మోడీ చేయాలనుకున్నానో అదే చేస్తూ.. విపక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వని మోడీపై అన్ని పార్టీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లుగా చెబుతున్నారు.

NCP AND Congress Planning for Early Elections


ఈ సమయంలోనే ఎన్సీపీ ,కాంగ్రెస్ , టిడిపి అధినేతలు ఇప్పుడు ఎకమయ్యి మోడీ ని దెబ్బ కొట్టాలనే వ్యూహంలో ఉన్నారు.. అందుకే ఓ భారీ ప్లాన్ కూడా వేసినట్టుగా తెలుస్తోంది..అయితే ముగ్గురి ప్లాన్ ఇదే అంటూ రిపబ్లికన్ టీవీ ఒక సంచలన కధనం ప్రసారం చేసింది..ఈ కధనం ప్రకారం వివిధ పార్టీలకు చెందిన వందమంది ఎంపీలు మూకుమ్మడిగా రాజీనామా చేయటం ద్వారా మధ్యంతర ఎన్నికలు తీసుకురావాలన్నదే ఈ ముగ్గురి ఆలోచన అని తేల్చింది..ఈ ప్రయత్నం ద్వారా మోడీ పై తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడంతో పాటు ప్రజలలో మోడీ పై ఉన్న నమ్మకాన్ని..దెబ్బకొట్టడమే ఈ ప్లాన్ తో భాగం అంటూ తెలిపింది..చంద్రబాబు పర్యటన మొత్తం ఇదే ప్లాన్ మీదుగా జరిగిందని తెలిపింది..