Nayanatara charged 5 cr for 2 days shoot

నయనతారలో ఉన్న ఆ సమ్మోహనశక్తి ఏమిటో దక్షిణాది కథానాయికలకు అర్థం కావడం లేదు. మిగితావారు ఒక పది-పదిహేను లక్షలు ఎక్కువ డిమాండ్ చేసినా వెనకడుగు వేస్తారు నిర్మాతలు. సినిమా ప్రమోషన్స్ కి రాను అని మరో హీరోయిన్ ని చెప్పమనండి, ఆ హీరోయిన్ ఇంటి దరిదాపుల్లోకి కూడా వెళ్ళరు. కాని నయనతార స్థాయి, స్థానం వేరు. దక్షిణాదిలోని మిగితా స్టార్ కథానాయికలు అందరికంటే డబుల్, అంటే నాలుగు కోట్లు తీసుకుంటోంది సినిమాకి. అయినా ఆఫర్లు తగ్గవు. సినిమా ప్రమోషన్స్ కి అస్సలు రాదు. ఒకవేళ రావాలంటే ఇంకా ఎక్కువ డబ్బు ఇవ్వాలి. అయినా ఆమె వెంటే దర్శకనిర్మాతలు.

ఇక యాడ్ ప్రపంచానికి నయనతార మొదటినుంచి దూరంగా ఉంటూ వచ్చింది. తను యాడ్ చేయడం చాలా అంటే చాలా రేర్. అలాంటిది ఈమధ్య ఒక DTH సర్వీసుల బ్రాండ్ యాడ్ లో కనబడుతోంది. అందరు ఆశ్చర్యపోయారు. నయనతారను యాడ్ కోసం ఒప్పించారంటే ఆ కంపెని తెలివితేటలు మామూలుగా లేవు అనుకున్నారు. కాని అసలు విషయం ఏమిటంటే, ఆ బ్రాండ్ నచ్చి లేక వారి మాటలకి కన్విన్స్ అయ్యి యాడ్ చేయలేదు నయన్. డబ్బు కోసమే చేసింది. అది కూడా ఎంతో తెలుసా ? ఏకంగా 5 కోట్లు అంట.

కేవలం రెండురోజులు షూట్ చేసినందుకు 5 కోట్లు తీసుకుంది నయన్. అంత చిన్న షూట్ కి అంతమొత్తం మహేష్ బాబు, ప్రభాస్ కూడా తీసుకోలేదేమో. 30 రోజులు ఓ సినిమా మీద పనిచేస్తే నాలుగు కోట్లు వచ్చేవి. ఇక్కడ రెండు రోజులు యాడ్ చేస్తే ఐదు కోట్లు వచ్చాయి. మరి ఇంత ఖర్చు పెట్టారు కదా, నయన్ బ్రాండ్ ఇమేజ్ వలన ఆ DTH బ్రాండ్ కి కస్టమర్లు పెరుగుతారు అంటారా ?