నవ గ్రహాలకు ఆలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా? Devotional Bhakthi Songs Programs    2017-11-18   21:43:03  IST 

హిందువుల దైనందిక జీవితం,ఆచార సంప్రదాయాలలో నవగ్రహాలకు ప్రముఖమైన స్థానం ఉంది. మనిషి యొక్క స్థితి గతులు,భవిష్యత్ మీద ఒక అవగాహనా కోసం మనిషి ఎక్కువగా నవగ్రహాల మీద ఆధారపడుతూ ఉంటాడు. అటువంటి నవగ్రహాలకు ప్రత్యేకంగా ఒక్కో నవగ్రహానికి ఒక్కో ఆలయం ఉంది. అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం.

తమిళనాడులో నవగ్రహాలకు ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి. సూర్యనార్‌ కోయిల్‌లో సూర్యగ్రహానికి ఆలయం ఉంది. ఇది కుంభకోణం అనే ప్రదేశానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. చంద్రుడి ఆలయం… తంజావూరుకు సమీపంలో తిరువయ్యూర్‌కు 8 కి.మీ దూరంలో తింగలూర్‌లో ఉంది. కుజగ్రహానికి ఆలయం… మైలాడులో వైదీశ్వరన్ కోయిల్‌కు సమీపంలో ఉంది. బుధుని ఆలయం… మైలాడుదురై సమీపంలోని తిరువేంగాడులో ఉంది.

గురు గ్రహానికి… కుంభకోణం సమీపంలోని అలంగాడి క్షేత్రంలో ఆలయం ఉంది. శుక్రగ్రహానికి… కుంభకోణానికి ఆరుకిలోమీటర్ల దూరాన ఉన్న (సూర్యనాయర్ కోయిల్ సమీపంలో) కంజనూన్‌లో ఆలయం ఉంది. శని గ్రహానికి… తిరునల్లార్‌లో ఆలయం ఉంది. ఇది కరైకాల్ క్షేత్రానికి దగ్గర. రాహువుకు… తిరునాగేశ్వరంలో ఆలయం ఉంది. ఇక్కడకు కుంభకోణం మూడు కిలోమీటర్ల దూరం. ఇక కేతుగ్రహానికి… పెరుంపల్లంలో ఆలయం ఉంది. ఇది మైలాడుదురై నుంచి పూంపహార్ వెళ్లే మార్గంలో ధర్మకుళం బస్టాపుకు సమీపంలో ఉంది.