పచ్చదనం,పెంపుడు జంతువులతో ఒత్తిడి దూరం

అంతేకాదు ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నా కూడా మానసిక వత్తిడిని దూరం చేసుకోవచ్చట. హుద్రోగా సమస్యలని అధిగమించవచ్చని తెలిపారు. మనం అనేకరకాలైన పనులు చూసుకుని ఇంటికి వచ్చినపుడు అవి మనకి ఎదురయ్యి మన మీద వాటి ప్రేమని చూపించే తీరు, అవి మనతో ఆడుకోవడానికి కొట్టే కేరింతల తో మానసిక ఉల్లాసం మనకి కలిగి ఎంత పెద్ద కష్టం అయినా చాలా చిన్నగానే కనిపిస్తుందట. అంతేకాదు వాటి ఆరోగ్య విషయంలో మనం తీసుకునే జాగ్రతలు మనలో చాలా సున్నిత మనసుని కలిగేలా చేస్తాయట.

చాలా మంది కుటుంభ సభ్యులుగా జంతువులని చూసుకుంటారు. ఇంట్లో వాటికే ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తుంటారు. అవి మనుషులతో పూర్తిగా కలిసిపోతూ, మన మనస్సులో నూతన ఉత్తేజాన్ని నింపుతాయి.