Natural Remedies for Cold

#వెల్లుల్లి:

వెల్లుల్లిని పూర్వ కాలం నుండి ముక్కు దిబ్బడ చికిత్సలో ఉపయోగిస్తున్నారు. వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటివైరల్ లక్షణాలు ముక్కు దిబ్బడ చికిత్సలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ముక్కులో ఇన్ఫెక్షన్ తొలగించి రద్దీని క్లియర్ చేయటానికి బాగా పనిచేస్తుంది . అందువల్ల వెల్లుల్లి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. సూప్ లో వెల్లుల్లిని వేసుకొని త్రాగితే కూడా మంచి పలితం కనపడుతుంది.

తులసి ముక్కులోని శ్లేష్మం మరియు బ్లాక్ లను తొలగించటానికి చాలా అద్భుతంగానూ సమర్ధవంతంగానూ పనిచేస్తుంది. కొన్ని తులసి ఆకులను నమలవచ్చు. లేకపోతే తులసి ఆకుల నుండి రసాన్ని తీసి త్రాగవచ్చు. ఇది నాసికా మార్గంను శుభ్రం చేసి ముక్కు దిబ్బడ నుండి ఉపశమనాన్ని కలిగించటంలో చాలా బాగా సహాయపడుతుంది.

#తేనె:

తేనె ముక్కు దిబ్బడ సమస్యను సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది . ఈ సమస్య నుండి బయట పడటానికి మరియు తొందరగా నివారించటానికి తేనెలో ఉండే సహజ లక్షణాలుసహాయపడతాయి. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ తేనే కలిపి త్రాగితే వెంటనే మంచి ఉపశమనం కలుగుతుంది.