వారణాసిలో మోడీ ఓటమి తధ్యం..షాకింగ్ రిజల్ట్స్ ..     2018-04-10   00:59:58  IST  Bhanu C

రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు..మిత్రులు శత్రువులు అవుతారు..శత్రువులు మిత్రులు అవుతారు..అయితే ఈ సూత్రమే ఇప్పుడు మోడీ కి పెద్ద తలనెప్పి తెచ్చిపెడుతోంది..నిన్నటివరకూ కత్తులు దూసుకున్న సమాజ్ వాదీ పార్టీ, బహుజనసమాజ్ పార్టీలు ఇప్పుడు కలిసి బీజేపి పై యుద్ధం ప్రకటించడంతో బీజేపి కి దిమ్మతిరిగి పోయింది..ఉత్తరప్రదేశ్ లో ఇప్పుడు బీజేపీకి ఈ రెండు పార్టీలు చుక్కలు చూపిస్తున్నాయి..వీరి దెబ్బతో బీజేపీ బీజేపి కి కంచుకోటలుగా ఉన్న స్థానాలు సైతం బద్దలవుతున్నాయి..


Narendra Modi may lose Varanasi in 2019 Elections.?


గత ఉపఎన్నికల్లో గోరఖ్ పూర్, పుల్పూర్ స్థానాల ఫలితాలే బీజేపి పరిస్థితిని తేల్చి చెప్పేశాయి..ఎస్పీ-బీఎస్పీ ఏకమవడంతో… పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది…గత ఎన్నికల్లో ఎన్ని స్థానాలు అయితే గెలుచుకుందో ఈ సారి అంతకంటే ఎక్కువగా స్థానాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది అంటున్నారు..అయితే ఇప్పుడు ముందు ఉన్న సవాల్ ఒక్కటే గోరఖ్ పూర్ లోనే ఓడిపోతే.. వారణాశిలో గెలుస్తారా..? ఎందుకంటే అక్కడ ప్రధానమంత్రి నరేందరమోదీ ఎంపీగా గెలిచారు…అయితే వారణాసి బీజేపి కి పెద్ద పట్టున్న స్థానం కూడా కాదు..అయితే 2004లో అక్కడ కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలిచింది కానీ 2009లో బీజేపీ అభ్యర్థిగా మురళీ మనోహర్ జోషి ఈస్థానం నుంచీ అత్యంత స్వల్ప తేడాతో గెలుపొందారు.