అక్కడ అలా ..ఇక్కడ ఇలా ! మోదీ రాజకీయం మాములుగా లేదు     2018-06-28   00:21:38  IST  Bhanu C

తనకు అవసరం ఉంటే ఒకలా.. అవసరం లేకపోతే ఒకలా వ్యవహరించడం రాజకీయ నాయకులకు కొత్తేమీ కాదు. మొన్నటివరకు బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీతో కేంద్రం సఖ్యతగా ఉంది. అడిగినవన్నీ చేసిపెట్టింది. కానీ ఆ తరువాత బీజేపీతో తెగతెంపులు చేసుకుని బయటకి వచ్చేసింది. ఇక అప్పటి నుంచి ఏపీ పై మోదీ సర్కార్ కక్ష చూపిస్తోంది. అదే సమయంలో తనకు ప్రస్తుతం రాజకీయంగా అవసరం అయిన తెలంగాణ ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ వారు అడిగినవి అన్ని చేసిపెడుతున్నారు. ఒకే సమస్య మీద వేర్వేరుగా స్పందిస్తూ .. మోదీ మార్క్ రాజకీయం రుచి చూపిస్తున్నాడు.

త‌మ‌కు సానుకూలంగా ఉండే రాష్ట్రాల అధికార పార్టీల ప‌ట్ల ఒక‌లా, ప్ర‌తికూలంగా మారిన ఆంధ్రాపై మ‌రోలా కేంద్రం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు చాలా స్ప‌ష్టంగా కనిపిస్తోంది. ఫెడ‌ర‌ల్ ఫ్రెంట్ టాపిక్ ను ఈ మ‌ధ్య కేసీఆర్ ప‌క్క‌న పెట్టేసినట్టుగా క‌నిపించేసరికి, రాజ్యసభలో డెప్యూటీ ఛైర్మన్ ఎన్నికకి ఇతరుల మద్దతు భాజపాకి అవసరమయ్యేసరికి, తెరాస దగ్గ‌ర చేసుకుంటున్న ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.ఏపీకి వ‌చ్చేస‌రికి… క‌డ‌ప ఉక్కు క‌ర్మాగారం మొద‌లుకొని కేంద్రం ఇవ్వాల్సిన ఇత‌ర హామీల‌పై దాటవేత ధోరణిలో మోదీ వ్యవహరిస్తూ ఏపీ పై తనకున్న అక్కసును తెలియజేస్తున్నాడు.