“సెక్రటేరియట్” లో దొర్లిన తప్పులు..లోకేష్ నువ్వు మారవా “నెటిజన్లు”  

లోకేష్ ఏపీ ఐటీ శాఖామంత్రి గా ఎంతో చదువుకున్న వ్యక్తిగా ఏపీ సీఎం చంద్రబాబు తనయుడిగా అందరికీ తెలుసు అయితే లోకేష్ పేరు అనుకున్న వెంటనే గుర్తుకు వచ్చేది పప్పు అందుకు తగ్గట్టుగానే అతని ప్రవర్తన కూడా ఉండటం గమనార్హం..లోకేష్ ఎప్పుడు స్పీచ్ మాట్లాడినా సరే దాంట్లో ఎదో ఒక తప్పు దొరకకుండా ఉండదు..ఎదో ఒక సందర్భంలో లోకేష్ తప్పుగా మాట్లాడి మీడియాకి అడ్డంగా దొరికి పోతూ ఉంటారు..రాజకీయ ప్రసంగాలు చేసేటప్పుడు ప్రత్యర్ధి పార్టీపై నిప్పులు చేరగ్గల్సిన లోకేష్ ప్రత్యర్ధి పార్టీలని ఎండగట్టాల్సిన లోకేష్ తమ పార్టీ పైనే అనుచిత వ్యాఖ్యలు చేయడం పరిపాటి అయ్యింది..అయితే

మాకు ఏపీలో ప్రధాన ప్రత్యర్ధి పార్టీ ఏదన్న ఆంది అంటే అది బీజేపి పార్టీనే అంటూ చెప్పడం..కనీసం వార్డు మెంబెర్స్ గా కూడా గెలవని వాళ్ళును ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా చేసిన గొప్ప ఘనత మాదే అంటూ చెప్పుకోవడం లోకేష్ ఒక్కడికే సాధ్యం అయ్యింది అయితే లోకేష్ మాట్లాడిన ఎన్నో సందర్భాలలో ఇలాంటి తప్పులు ఎన్నో దొర్లుతూ ఉంటాయి..అయితే ఇలాంటి మిస్టేక్స్ పై దృష్టి పెట్టక పోవడం వలన లోకేష్ ఎప్పటికప్పుడు మీడియా కి దొరికేస్తూ ఉంటాడు.