బాబు కి మరో తలనొప్పి ..పప్పులో కాలేసిన లోకేష్     2018-08-16   16:07:19  IST  Bhanu C

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లాంటి అపారమైన అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు రాజకీయ చరిత్రలోనే లేడని, అంత కాదు ఇంత కాదు అంటూ తెగ గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ నాయకులకు లోకేష్ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. ఎప్పుడూ ఏదో ఒక అంశంలో దొరికిపోవడం ప్రత్యర్థి పార్టీలకు ఆటలో అరటిపండులా మారిపోవడం షరా మాములే అయిపోయింది. లోకేష్ కావాలని చేయకపోయినా వాటికి మొత్తం టీడీపీ జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇలా అయితే లోకేష్ ని ఎక్కడో కూర్చోబెట్టాలనుకున్న బాబు ఆశలకు గండిపడే అవకాశం లేకపోలేదు.

Chandrababu Naidu,Nara Lokesh,Nara Lokesh Did Blender Mistake At August 15th,TDP

తప్పు మీద తప్పు చేస్తున్న లోకేష్ తాజాగా మళ్ళీ ఓ తప్పు చేసి ప్రత్యర్థి పార్టీలకు దొరికిపోయాడు . ఇంకేముంది వారు పంచ్ డైలాగులతో లోకేష్ పరువు కాస్తా తీసిపడేశారు.
మంత్రి నారా లోకేష్ ఆగష్టు 15వ తేదీ ఉదయం జెండా వందనం చేయటం వివాదమవుతోంది. మంత్రి హోదాలో జెండా వందనం చేయటంలో తప్పేమీలేదు. కానీ మంత్రి హోదాలో ఉండి, అది కూడా ఇంటి మేడ మీదే జెండా వందనం చేయటం తప్పనే అంటున్నారు. ఇంటి ముందు ప్రాంగణంలోనే జెండా ఎగురవేయవచ్చు. లేదా సచివాలయంలో జరిగే జెండా పండుగకు హాజరు కావచ్చు. అతీ కాకపోతే రాష్ట్రపార్టీ కార్యాలయంలో కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అటువంటిది అన్నింటినీ పక్కనపెట్టేసి ఇంట్లో మేదమీదే అదికూడా భార్య నారా బ్రాహ్మణి, కొడుకు దేవాన్ష్ తో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తూ జెండా వందనం చేయటం వివాదాస్పదమైంది.

Chandrababu Naidu,Nara Lokesh,Nara Lokesh Did Blender Mistake At August 15th,TDP

అంతే కాదు లోకేష్ తో పాటు ఆయన భార్య బ్రాహ్మణి పోలీసు గౌరవ వందనం స్వీకరించటం ఇంకా తప్పైంది. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నారు కాబట్టి లోకేష్ గౌరవ వందనం స్వీకరించడంలో ఎంటువంటి తప్పులేదు. కానీ బ్రాహ్మణి ఏ విధంగా పోలీసు గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆమెకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోడలు, మంత్రి భార్య అన్న హోదా తప్ప ఇంకేమీ లేదు. కనీసం ఈ పాటి ఆలోచన కూడా లోకేష్ చెయ్యకపోవడం విమర్శలకు దారితీస్తోంది. సోషల్ మీడియాలో ఈ అంశం మీద నెటిజెన్లు విరుచుకుపడుతున్నారు. మొన్ననే నారా బ్రాహ్మిణి రాహుల్ ని కలవడం , తాజాగా లోకేష్ ఇలా బుక్కయిపోవడం బాబు లో అసహనం పెంచుతున్నాయి.