లోకేష్..సీఎం”...మహానాడులో డిమాండ్. వ్యుహాత్మకమేనా..?     2018-05-30   03:48:56  IST  Bhanu C

లోకేష్ సీఎం అభ్యర్ధిగా ఉండాలి అనే డిమాండ్ మహానాడు సాక్షిగా వినిపిస్తోంది..ముందు నుంచీ ఈ డిమాండ్ వస్తున్నా సరే గత కొంతకాలంగా ఏపీలో జరుగుతున్న పరిణామాల కారణంగా ఎక్కడా మళ్ళీ లోకేష్ సీఎం డిమాండ్ వినిపించలేదు..అయితే మళ్ళీ అనూహ్యంగా ఈ డిమాండ్ మహానాడు వేదికగా చంద్రబాబు సాక్షిగానే మళ్ళీ తెరపైకి వచ్చింది..లోకేష్ నాయకత్వంలో ముందుకు వెళ్ళాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి..

అయితే మహానాడులో ప్రసంగించిన జేసీ వ్యాఖ్యలు సైతం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కాక పుట్టిస్తున్నాయి. ఏ లోకేష్ ఇంకా ఎదురు చూడాలా… ఇంకా మీరే చంద్రబాబే సీఎం గా ఉండాలా అని నేతలు గళం విప్పారు. అయితే ఈ వ్యాఖ్యలు ఎక్కడో చేయలేదు సాక్షాత్తు చంద్రబాబు ముందే చేశారు..సూటిగా సుత్తి లేకుండా ఉన్నది తాను అనుకున్నది అనుకున్నట్లు జేసీ తన మనసులో మాటనే కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలు కూడా ఇవే అంటూ తేల్చి చేప్పేశారు…ఇంకెన్నేళ్లు సీఎంగా ఉంటారు. ప్రధానమంత్రి పీఠం ఎక్కండి అంటూ జేసీ చేసిన వ్యాఖ్యలు సభలో ఉన్న అందరూ హర్షాన్ని ప్రదర్శించారు..