Nara Brhamani Tension with Murali Mohan

ఏపీలో టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌, రాజ‌మండ్రి ఎంపీ మాగంటి ముర‌ళీమోహ‌న్ ఏపీ సీఎం చంద్ర‌బాబుతో పాటు ఆయ‌న కోడ‌లు నారా బ్రాహ్మ‌ణిని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నార‌ట‌. చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితుడు అయిన ముర‌ళీమోహ‌న్ ఆ ఫ్యామిలీనే ఇబ్బంది పెట్టేయ‌డం ఏంట‌న్న‌ది కాస్త షాకే. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే ముర‌ళీమోహ‌న్ ప్ర‌స్తుతం రాజ‌మండ్రి ఎంపీగా ఉన్నారు. ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌న‌ని, త‌న‌కు టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి కావాల‌ని బాబు వ‌ద్ద ప్ర‌పోజ‌ల్ పెట్ట‌గా బాబు ఆయ‌న ప్ర‌తిపాద‌న తిర‌స్క‌రించారు.

టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి కోసం టీడీపీలో పోటీ తీవ్రంగా ఉండ‌డంతో ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు ఈ ప‌ద‌వి తాను ఇవ్వ‌న‌ని తేల్చిచెప్పేశారు. దీంతో ముర‌ళీమోహ‌న్‌కు ఈ విష‌యంలో షాక్ త‌ప్ప‌లేదు. 2014 ఎన్నిక‌ల్లో 1.57 ల‌క్ష‌ల భారీ మెజార్టీతో గెలిచిన ఆయ‌న క్ర‌మ‌క్ర‌మంగా రాజ‌మండ్రి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు దూర‌మ‌వుతూ వ‌స్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌స్తుతం ఆయ‌న‌పై తీవ్ర వ్య‌తిరేక‌త ఉంది.