నానికి తప్పుడు సలహా వల్ల..!     2018-04-30   04:55:26  IST  Raghu V

గత రెండు సంవత్సరాలుగా నాని వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు. ఏడు వరుస సక్సెస్‌లు దక్కించుకున్న నాని తాజాగా ‘కృష్ణార్జున యుద్దం’ చిత్రంతో ఫెయిల్యూర్‌ను చవిచూశాడు. ఇన్నాళ్ల తర్వాత ఫ్లాప్‌ రావడానికి ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఈ చిత్రం ఎంపిక చేసుకోవడం వెనుక ఉన్న వారు నానితో తప్పుడు నిర్ణయం తీసుకునేలా చేశారు అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పలు చిత్రాల కోసం మంచి కథలు ఎంచుకున్న నానికి టాలీవుడ్‌లో మంచి కథలు ఎంచుకుంటాడు అనే పేరు ఉంది. కాని ఇప్పుడు మాత్రం ఆయన వరుసగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు.

ప్రస్తుతం నాని మల్టీస్టారర్‌ చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. నాగార్జునతో కలిసి నాని ఈ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. మల్టీస్టారర్‌ చిత్రం చేయాలనే ఉద్దేశ్యంతో కథపై దృష్టి పెట్టకుండా ఈ చిత్రం కథను నాని ఎంచుకున్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక రొటీన్‌ కథాంశంతో దర్శకుడు శ్రీరామ్‌ ఆధిత్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా తెరకెక్కుతున్న ఈ చిత్రం నాని కెరీర్‌లో మరో ఫ్లాప్‌గా నిలవడంఖాయం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.