నాని కాపురం లో చిచ్చు పెట్టిన శ్రీరెడ్డి..? ఇది నా దురదృష్టం అంటూ ఫేస్బుక్ లో పోస్ట్!    2018-06-09   21:58:34  IST  Raghu V

నేచురల్ స్టార్ నానీ హోస్ట్‌గా ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ‘బిగ్‌బాస్’ సీజన్-2పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతేడాది ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘బిగ్‌బాస్’ సీజన్-1కు మంచి ఆధరణ లభించిన నేపథ్యంలో సీజన్-2 కూడా రక్తికడుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. నాని ప్రోమోలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ఈ షోకు ఎంపికయ్యే సెలబ్రిటీలు ఈ సారి 100 రోజుల పాటు బిగ్‌బాస్ హౌస్‌లో ఉండాలి. మొత్తం 16 మంది సెలబ్రిటీల్లో ఎవరెవరు ‘బిగ్‌బాస్‌’ హౌస్‌లో అడుగుపెడతారనే ఉత్కంఠతకు తెరపడేది కూడా ఆదివారమే. ఇందులో ఉండే సెలబ్రిటీలపై ఇప్పటికే మీడియాలో అనేక ‘లీకులు’ వచ్చాయి. లీకైన జాబితాలో శ్రీరెడ్డి పేరు కూడా వినిపించింది

దానిపై శ్రీరెడ్డి స్పందిస్తూ..తాజాగా శ్రీరెడ్డి మరోసారి నానిని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. నానిని ఇప్పటికే రెండు మూడు సార్లు టార్గెట్ చేసిన శ్రీరెడ్డి తాజాగా బిగ్‌బాస్‌-2 హోస్ట్‌ నానిని ఉద్దేశించి తీవ్రవ్యాఖ్యలు చేశారు. సదరు రియాలిటీ షోలో తన ఎంట్రీపై స్పష్టత ఇవ్వకుండా ఈ రకమైన కామెంట్లు చేయడం పబ్లిసిటీలో భాగమా ? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.