బిగ్ బాస్ కంటెస్టెంట్ గీత మాధురి పై ఆమె భర్త నందు ఏమని పోస్ట్ చేసారో తెలుసా.? చూస్తే ఫిదా.!  

భాను పట్టుకున్న యాపిల్స్‌ బయటకు కనపడటంతో కౌశల్ వాటిని బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. దీంతో, భాను.. కౌశల్ చేతులు తన చెస్ట్‌కు తగిలాయంటూ రచ్చ చేసింది. అతడి క్యారెక్టర్ అలాంటిదంటూ భాను, తేజస్వీలు కౌశల్‌ను తిట్టిపోశారు. ఈ విషయాన్ని రచ్చ చేయాలని ప్రయత్నించారు. అయితే, కౌశల్ యాపిల్ తీసేప్పుడు అక్కడే ఉన్న గీతా మాధురీ.. వారిద్దరు చేస్తు్న్న ఆరోపణలను వ్యతిరేకించింది.

కౌశల్ ఉద్దేశపూర్వకంగా భానును తాకలేదని, యాపిల్‌ను తీయడానికే ప్రయత్నించాడని గీతా తెలిపింది. ‘‘ఆటను ఆటలా ఆడండి. క్యారెక్టర్ల జోలికి వెళ్లొద్దు’’ అని తేజస్వీ, భానులకు క్లాస్ పీకింది గీతా. చివరికి భాను.. కౌశల్ తనను కావాలని తాకలేదని ఆమె వివరణ ఇచ్చుకోక తప్పలేదు. బిగ్‌బాస్‌కు కూడా భాను వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించింది. చివరికి భాను.. కౌశల్ వద్దకు వెళ్లి క్షమాపణలు చెప్పింది.

ఇది ఇలా ఉండగా “గీత మధురైకి” అందరు ఫిదా అయిపోయారు. సోషల్ మీడియాలో అయితే ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ తరుణంలో గీత మాధురి భర్త నటుడు నందు కూడా ఇంస్టాగ్రామ్ లో గీత మాధురి అకౌంట్ ద్వారా మళ్ళీ పడిపోయా అంటూ పోస్ట్ చేసాడు. ఆ పోస్ట్ మీరే చూడండి!

“Malli padipoya ❤️,loved the way how Madhuri stood by what is right.I already have enough reasons to feel that she is the Best decision of my life ,she just gave me another reason today ,anthey ❤️ Total respect to you Maddz ❤️ #BigBoss2 #bigbosstelugu2 #bigbosstelugu #గీతామాధురి”

మంచి-చెడు టాస్క్‌లో వరెస్ట్ పెర్ఫార్మర్‌ ఎవరో చెప్పి, జైల్లో పెట్టాలని హౌస్ కెప్టెన్ కౌశల్‌ను బిగ్‌బాస్ కోరాడు. దీంతో కౌశల్ భానును జైల్లోకి పంపాడు. శుక్రవారం ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో దీప్తీ సునైనా, గీతా కెప్టెన్ టాస్క్ కోసం పోటీపడనున్నారు.