మొన్నటి వరకు కౌశల్ పై కామెంట్స్..! ఇప్పుడేమో దీప్తి పై.! అడ్వాంటేజ్ తీసుకుంది అంట!  

బిగ్‌బాస్ ఊహించని సంఘటనలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతున్నది. గతవారం ఎలిమినేషన్‌లో భాగంగా నందినిరాయ్ ఇంటి నుంచి బయటకు వచ్చింది. బిగ్‌బాస్ హౌస్‌కు వెళ్లిన వారు ఎవరో ఒకరు బయటకు రావాల్సిందే. కానీ నందిని ఎలిమినేషన్ మరోసారి చర్చకు దారి తీసింది. ప్రేక్షకుల్లో నందిని స్వయంగా చేసిన తప్పులే ఆమె షో నుంచి బయటకు రావడానికి కారణమైందనే వాదన వినిపిస్తున్నది

ఇటీవలే బిగ్‌బాస్ 2 నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘‘ఫ్లిప్ టాస్క్‌లో దీప్తి సిట్యుయేషన్‌ని అడ్వాంటేజ్ తీసుకుంది. నాకు ఫస్ట్ టైమ్ దీప్తి అప్పుడు నచ్చలేదు. ఫస్ట్ టైమ్ నేను అనుకున్నా ఆవిడ నామినేషన్‌లో ఉన్నారు కాబట్టి ఓవర్ రియాక్ట్ అయ్యారు. ఇందులో నో డౌట్. ఎందుకంటే.. ఏ మనిషైనా ఫస్ట్ పడిన వెంటనే దెబ్బ తగులుతుంది కాబట్టి ఏడవాలి.

ఆవిడ పడిన వెంటనే నా మొహం చూసి ఏం చేశావు నువ్వు అని చెప్పి ఒక పాజ్ తీసుకుని.. హ్యాండ్ చూసుకుని అప్పుడు ఏడవడం స్టార్ట్ చేసింది ఆవిడ. అది నిజంగా నాకు నచ్చలేదు. సిట్యుయేషన్‌ను ఆవిడ అడ్వాంటేజ్ తీసుకున్నారని నా గట్టి ఫీలింగ్.

బిగ్‌బాస్ ఇంట్లోకి ఓ వారం తర్వాత నందిని ప్రవేశించింది. అప్పటికే ఇంట్లో ఉన్న వ్యక్తుల్లో బాగా పరిచయం ఉన్న వ్యక్తి కౌశల్ . తొలినాళ్లలో ఫ్రెండ్ షిప్ అంటూ ఆయనకు దగ్గరైంది. ఇంట్లో పరిస్థితి అర్థం కావడం లేదు. సలహాలు, సూచనలు ఇవ్వు అని కౌశల్‌ను అడిగింది. దాంతో నందినికి తగిన సలహాలు ఇచ్చి గైడ్ చేశారు. కానీ తర్వాత కౌశల్ ఏదైనా చెబితే దానికి కౌంటర్ ఇవ్వడం చేస్తు వచ్చింది. అలాగే మిగితా ఇంటి సభ్యుల ముందు కౌశల్‌పై కామెంట్లు చేయడం మొదలుపెట్టింది. దాంతో వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. దారుణంగా మాట్లాడుతూ నోరు జారింది. చివరికి కౌశల్ ఆర్మీ ఆమెని ఎలిమినేట్ చేసారు.