అయ్యో.. చివరకు ఇంత దిగజారాడా?     2018-06-02   00:08:40  IST  Raghu V

తెలుగు సినిమా పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీకి ఉన్న పేరు ప్రతిష్టల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నందమూరి తారక రామారావు వారసులుగా ప్రస్తుతం పలువురు ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్నారు. అయితే అది నాణెంకు ఒక్కవైపు మాత్రమే. నాణెంకు రెండవ వైపు మరోలా ఉంది. సినిమా పరిశ్రమలో ఉన్న వారు కాకుండా ఇతరులు కాస్త ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఎన్టీఆర్‌ వారసులు కొందరు కొన్ని కారణాల వల్ల సినిమాలకు దూరంగా ఉన్నారు. కొందరు మాత్రం సినిమాల్లో ప్రయత్నించినా కూడా సఫలం కాలేక పోయారు. అందులో ఒకడు తారకరత్న. ఈయన పలు సినిమాలు చేసినా కూడా ఏ ఒక్కటి కూడా ఆకట్టుకోలేక పోయాయి.

హీరోగా ఒకేసారి దాదాపు ఎనిమిది సినిమాలను మొదలు పెట్టి రికార్డు సృష్టించిన తారకరత్న అందులో ఏ ఒక్కటి సక్సెస్‌ కాకపోవడంతో పూర్తిగా ఢీలా పడిపోయాడు. హీరోగా సక్సెస్‌ు రావడం లేదనే ఉద్దేశ్యంతో విలన్‌గా కూడా ప్రయత్నించాడు. విలన్‌ వేశాలు బాగానే వేస్తున్నప్పటికి ఈయనకు ఆ వేశాలు ఇచ్చేందుకు స్టార్‌ దర్శకులు ఆసక్తి చూపడం లేదు. నందమూరి ఫ్యామిలీ హీరో విలనా అంటూ విమర్శలు వ్యక్తం అవుతాయనే ఉద్దేశ్యంతో ఆ ఛాన్స్‌లు కూడా ఇవ్వలేదు. దాంతో తారకరత్న పరిస్థితి దారుణంగా తయారు అయ్యింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న సమయంలో అనుకోని అవకాశం దక్కింది.