76 ఏళ్ల సీనియర్ హీరోతో నమిత పెళ్ళి?  

నమిత గుర్తుందా? అదే, ఒకప్పుడు వెంకటేష్ తో జెమిని, శ్రీనువైట్ల దర్శకత్వంలో సొంతం లాంటి సినిమాలు చేసింది గుర్తుందా? అయినా ఎలా మర్చిపోతారు లేండి ఈ బొద్దు భామని. మధ్యలో మనకు తెలిసిన తెలుగు సినిమా బిల్లా ఒకటే అయినా, ఈ భామ పాపులారిటీ మాత్రం తగ్గలేదు. కుర్రాళ్ళు అలా ఎలా మర్చిపోతారు లేండి. తమిళనాట అయితే ఏకంగా నమితకి గుడి కట్టేసారు. కాని ఒకప్పటి హవా ఇప్పుడు లేదు.

నమితాకి అవకాశాలు ఎప్పుడో తగ్గిపోయాయి. దాంతో దొరికిన ప్రతి చిన్నాచితక సినిమా చేసుకుంటూ పోయింది. పరిస్థితి ఎలాంటి స్థితికి దిగజారింది అంటే, చెన్నై లో చాలాకాలం ఒక మామూలు ఇంట్లో అద్దెకు ఉంటూ వచ్చింది నమిత. అప్పుడే బిగ్ బాస్ (తమిళం) అవకాశం తలుపు తట్టింది. నమిత ఫైనల్స్ దాకా వెళ్ళకపోయినా, ఎంతోకొంత డబ్బు అందటంతో ప్రస్తుతానికి ఫైనాన్సియల్ కష్టాలు పెద్దగా ఏమి లేవు అనుకుంటా.