మీ పేరు N అక్షరంతో మొదలు అవుతుందా... మీ జీవితంలో జరిగే ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకోండి     2018-01-28   21:00:29  IST  Raghu V

Name Starts with letter N

ఒక వ్యక్తి పేరును బట్టి అతని జీవితంలో చేసే పనులు,ఆలోచనలు ఆధారపడి ఉంటాయని మీకు తెలుసా? న్యూమరాలజీ ప్రకారం ఒక వ్యక్తి తొక్క గుణగణాలను తెలుసుకోవచ్చు. ఇప్పుడు N అక్షరంతో పేరు మొదలు అయ్యే వారి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

N అక్షరంలో శక్తి పాజిటివ్ దృక్పధాన్ని పెంచుతుంది. అలాగే వీరిలో ఇతరులను ఒప్పించే గుణాలు కూడా అధికంగానే ఉంటాయి. ఇతరులను ప్రభావితం చేసే వ్యక్తిత్వం కలిగి సాదాసీదాగా వినయంగా ఉంటారు. వీరు స్పష్టమైన ఆలోచనలను కలిగి ఉంటారు. వీరికి ప్రతి విషయంలోనూ సొంత ఆలోచనలు,సొంత అభిప్రాయాలు ఉండుట వలన ఎవరి మాట వినకుండా తనదైన శైలిలో రాణిస్తారు.

వీరికి స్నేహితులు చాలా తక్కువ. ఒకవేళ ఉన్నా స్నేహానికి చాలా విలువ ఇస్తారు. జీవితంలో ఎదుర్కొనే సమస్యల కారణంగా బలవంతులుగా,శక్తివంతులుగా మారతారు. మితంగా,నిదానంగా మాట్లాడిన ఎవరైనా ఏదైనా అంటే మాత్రం సహించరు. వీరు తొందరగా బయట పడకపోవటం వలన అర్ధం చేసుకోవటం కష్టం. ఎవరిపైన అయినా ప్రతీకారం తీర్చుకోవాలంటే సులభంగా తీర్చుకుంటారు. వీరి వ్యక్తిత్వం వీరి జీవితానికి ప్లస్ పాయింట్ అవుతుంది.