మీ పేరు H అక్షరంతో మొదలు అవుతుందా? మీ జీవితంలో జరిగే ఆసక్తికరమైన విషయాలు     2018-06-06   00:44:11  IST  Raghu V

H అక్షరంతో పేరు ప్రారంభం అయ్యే వారి గుణగణాలు,లక్షణాలు గురించి తెలుసుకుందాం. వీరికి విపరీతమైన కోరికలు ఉంటాయి. వాటికీ హద్దు కూడా ఉండదు. వీరికి ఉన్నతంగా ఎదిగి మంచి పేరు తెచ్చుకోవాలనే కోరిక,తపన ఎక్కువగా ఉంటాయి. వీరికి ఉపయోగం ఉంటుందని ఆంటే ఏ పని చేయటానికి అయినా సిద్ధంగా ఉంటారు. వీరిలో నేర్పు,చాకచక్యం ఎక్కువగా ఉండి సమయానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తారు. కొన్ని సార్లు ఎదుటి వ్యక్తి అపార్ధం చేసుకొనే పరిస్థితి కూడా ఎదురు అవుతుంది.

మీ పేరు H అక్షరంతో మొదలు అవుతుందా? మీ జీవితంలో జరిగే ఆసక్తికరమైన విషయాలు

వీరు ఎక్కువగా ప్రణాళికల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఖాళీ లేకుండా ఆలోచనలు చేస్తూ ఉంటారు. జీవితంలో శ్రమ పడకుండా హ్యాపీగా జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. అందువల్ల వీరు శారీరక శ్రమ చేయటానికి కన్నా మానసిక శ్రమ చేయటానికి ఎక్కువగా ఇష్టపడతారు. అందువల్ల వీరు మానసిక శ్రమ చేసే ఉద్యోగాలను ఎంచుకుంటారు.